Balakrishna కోసం క్యూ కట్టిన యువ దర్శకులు
నందమూరి నటసింహం బాలకృష్ణ అమోఘమైన ఫాంలో ఉన్నారు. వరుసపెట్టి హిట్లు ఇస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో చేసిన అఖండ2 అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా ఈ సినిమా కూడా రూ.150 కోట్ల పైనే వసూలు చేసింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు బాలయ్య. ముంబయి నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డాన్ గా నటిస్తున్నారు. దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ ఒక స్క్రిప్ట్ వినిపించారు. దాదాపుగా ఇది ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
దర్శకులంతా క్యూ కట్టారు
అయితే వరుసగా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన కొరటాల శివ కూడా మెసేజ్ తో కూడిన ఓ మాస్ కథను వినిపించారు. ఇది కూడా బాలయ్యకు నచ్చింది. మరోవైపు మార్కూ లాంటి విధ్వంసకర సినిమాను తీసి సంచలనం సృష్టించిన మళయాళ దర్శకుడు హనీఫ్ ఇదే తరహాలో మరో కథను బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా రూపొందించారు. దీన్ని దిల్ రాజు నిర్మించడం దాదాపు ఖాయమైంది. అలాగే వివేక్ ఆత్రేయ, వెంకీ కుడుముల, డాకూ మహారాజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ చిరంజీవి సినిమా అయిపోయిన తర్వాత బాలయ్యతో చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా వేగాన్ని పెంచారు. గోపీచంద్ తో చేసే సినిమాను విజయదశమికి విడుదల చేసి, హరీష్ శంకర్ తోకానీ, ఆత్రేయతో కానీ చేసే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.

దర్శకులకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చే బాలయ్య
తెలుగులో ఉన్న యువ దర్శకులందరికీ బాలయ్య ఇప్పుడు ఫేవరెట్ హీరో అయిపోయారు. ఎందుకంటే బాలయ్య.. ఒకసారి కథ విన్న తర్వాత అందులో జోక్యం చేసుకోరు. పూర్తిగా దర్శకుడి స్వేచ్ఛకే వదిలేస్తారు. కొందరు హీరోలు మాత్రం కథల్లో వేలు పెట్టి సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా కిందికు జారిపోయేలా చేస్తారు. కానీ బాలయ్య దర్శకుడు ఎలా చెబితే అలా చేస్తారు. అందుకే ప్రతి దర్శకుడు ఇప్పుడు బాలకృష్ణ వెంట పడుతున్నారు. ఎంత వేగంగా చేసినా సంవత్సరానికి రెండు సినిమాలకు మించి విడుదలయ్యే అవకాశం లేదు. అయితే చేయాలనుకుంటే ఏడాదికి మూడు సినిమాలు కూడా విడుదల చేయొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది కొత్త డైరెక్టర్లు బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారో త్వరలోనే తేలనుంది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications