మోక్షజ్ఞకు పోటీగా మరో స్టార్ హీరో కొడుకు?
నటసింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా? అనే ఆసక్తితో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు పరిశ్రమలోకి అడుగు పెడతాడా? ఎప్పుడు రికార్డులు బద్దలు కొడతాడా? అంటూ వారంతా ఎంతో ఆత్రుతగా ఉన్నారు. మొన్నటివరకు అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడంటూ వార్తలు రావడమేకానీ సరైన సమాచారం మాత్రం బాలకృష్ణ ఇవ్వడంలేదు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు మాత్రం త్వరలోనే కొడుకు ఎంట్రీ ఉంటుందని చెప్పారు. దీంతో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు.
బాలయ్యకు జ్యోతిష్యాలమీద గట్టి నమ్మకం. వాటి ప్రకారం 2025 సెప్టెంబరు లోపు మోక్షజ్ఞ పరిశ్రమలోకి రాకుండా ఉంటేనే మంచిదని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే ఈలోగా కథలను, డైరెక్టర్లను బాలకృష్ణ సిద్ధం చేసుకున్నాడంటున్నారు. ఓ మూడు కథలతోపాటు ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు కూడా నానుతున్నాయి. మరి డైరెక్టర్ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల తాను ఎక్కడికి వెళుతున్నా తనతోపాటు కొడుకు అకిరా నందన్ ను వెంటపెట్టుకొని వెళుతున్నారు.

సినిమాల్లోకి రానున్న అకిరా నందన్
గత నెలరోజుల నుంచి సోషల్ మీడియాలో అకిరా నందన్ వార్తల్లో నిలుస్తున్నాడు. 2025 ఏడాది చివరలో అకిరాను సినిమాల్లోకి తీసుకువచ్చే ఆలోచనలో పవన్ ఉన్నాడని, అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే కొడుకును ప్రమోట్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అకిరా నందన్ ఎత్తు కూడా సినిమా హీరోలకు సరిపోయేంత స్థాయిలో ఉందని, కచ్చితంగా సినిమాల్లోకి రాబోతున్నాడని పవన్ అభిమానులు అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మోక్షజ్ఞకు పోటీగా అకిరా నందన్ రావడం జరుగుతుందంటున్నారు. రాజకీయాల్లో బాలయ్య, పవన్ కల్యాణ్ కలిసిమెలిసి ఉంటున్నారని, సినిమాల్లో కూడా వీరిద్దరి అభిమానులు కలిసిపోతారా? ఎవరికి వారుగానే పోటీపడతారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications