నందమూరి మోక్షజ్ఞ సినిమా పేరు ‘సింబా’
నందమూరి నటసింహం తనయుడు మోక్షజ్ఞ పరిచయం ఎప్పుడా? ఎప్పుడా? అంటూ బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారు ఎదురుచూస్తున్నకొద్దీ మోక్షజ్ఞ అరంగ్రేటం మాత్రం రోజురోజుకు ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు బాలయ్య మాత్రం కుర్రహీరోలు కూడా అందుకోలేనంత వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యువ దర్శకులంతా బాలకృష్ణతో సినిమాలు చేయడానికి కథలు వినిపించి డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాతో మోక్షజ్ఞ పరిచయం కావాల్సి ఉందికానీ అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది.
ఈ సినిమా అయితే మినిమం గ్యారంటీ
ఆ తర్వాత రకరకాల పేర్లు వినిపించాయి. చివరకు ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 లో నటిస్తాడని, అందులో బాలయ్య కూడా ఉంటాడని, వీలైతే బాలయ్య లేదంటే క్రిష్ దర్శకత్వం వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే మోక్జజ్ఞ నటించే అవకాశం ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా పేరు సింబా. సోషియా ఫాంటసీ కథతో దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ తరహా సినిమా అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది. అంతేకాకుండా బాలయ్య అభిమానులు కూడా థియేటర్లకు పోటెత్తితే, సినిమా ఏమాత్రం కొంచెమైనా బాగుందనే మౌత్ టాక్ వచ్చినా చాలు.. సూపర్ హిట్ అవడం గ్యారంటీ. అందుకే బాలయ్య కూడా ఈ కథకే మొగ్గుచూపారు. సింబా సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రూపుదిద్దుకుంటోంది.
భారీ బడ్జెట్ తో జై హనుమాన్
దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాతో ఏకంగా ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ఆయనపై బాధ్యత మరింత పెరిగింది. ఆయన ఒక పెద్ద సూపర్ హీరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ తీస్తున్నారు. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇది భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.












Click it and Unblock the Notifications