ఫ్యాన్ వార్ కి ఇక చెక్.. ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ
నేటి సమాజంలో సినిమాలు, రాజకీయాలపై మనుషులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు విషయాల్లోనే ప్రజలు వారి గురించి కూడా పట్టించుకోకుండా ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తారేమో అనిపిస్తుంది. ఫలానా హీరో కోసమో, ఫలానా రాజకీయ నాయకుడి కోసమే ఒకరిపై మరొకరు దుర్భాషలు ఆడుకుంటూ గోడవలకి దిగుతున్నారు. రాజకీయాల కారణంగా ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం, హత్యలు చేసుకోవడం చూశాం. ఇప్పుడు ఈ విష సంస్కృతి సినిమా హీరోల విషయంలో కూడా మళ్లీ మొదలవుతోంది.
ఒక వైపు సినిమా హీరోలంతా మేమే మేము బాగానే ఉంటాం అని బహిరంగంగానే చెప్పుకొని.. బాగానే ఉంటున్నారు. కానీ వారి అభిమానులే అభిమానాన్ని హద్దులు దాటించి ఇలా ప్రవర్తిస్తుంటారు. ఓపెన్ గా ఒక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడారు. మేము మేము బాగానే ఉంటాం.. మీరే బావుండాలి అని. అలా చెబుతున్నా కూడా కొందరిలో మార్పు రావడం లేదు.

మీ కంటే మా హీరోనే ఎక్కువ.. మీ హీరో రికార్డ్స్ కంటే మా హీరో రికార్డ్స్ ఎక్కువ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఈ తరహా ఫ్యాన్ వార్ లను సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అయితే గత కొన్ని రోజులుగా హీరో నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అనే విషయంపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో అసలు విజయ్ కెరీర్ లైన్ లో పడిందని ఓ వర్గం చెబుతుంటే.. సక్సెస్ లేట్ అయినా విజయ్ రెన్ నెక్స్ట్ లెవెల్ అంటూ మరో వర్గం వాదిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు సైలెంట్ గా ఈ ఫ్యాన్ వార్ కి చెక్ పెట్టేశారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని హీరోగా చేస్తే.. విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించాడు. కొద్దిసేపు ఉన్నా కూడా విజయ్ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాతోనే మాళవిక నాయర్ టాలీవుడ్ కి పరిచయమైంది. ఇక ఈ సినిమా మార్చి 21న రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. దాంతో మూవీ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, నాని, మాళవిక కలిసి సినిమాలోని ఐకానిక్ ఫోజుని రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక త్వరలోనే నాని నటించిన 'హిట్ 3', విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్ డమ్' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హ్యాట్రిక్ హిట్ లతో ఉన్న నాని జోష్ ని కంటిన్యూ చేయాలని భావిస్తుంటే.. మళ్లీ హిట్ కొట్టి ట్రాక్ లోకి రావాలని విజయ్ భావిస్తున్నాడు. చూడాలి మరి హిట్ కొట్టేదెవరో అని.












Click it and Unblock the Notifications