దయచేసి అలా చూడటం మానుకోండి
దక్షిణ భారతదేశం నుంచి హీరోయిన్ గా ఉంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారడమేకాదు.. నేషనల్ క్రష్ అయ్యారు రష్మిక మందన్నా. ఆమె ఏదైనా సినిమా ఒప్పుకుందా? అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే టాక్ పరిశ్రమలో నడుస్తుంటుంది. నాగశౌర్య సరసన ఛలో సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన రష్మిక మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. తాజాగా ఈ అమ్మడు యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొంది. పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.
యానిమల్ సినిమాలో హాట్ గా కనిపించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి అందరినీ షాక్ కు గురిచేసింది. యానిమల్ పార్క్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు. కన్నడ పరిశ్రమలో ఓ హీరోతో ప్రేమలో పడ్డ రష్మిక తర్వాత బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ప్రతి సినిమాకు రూ.3 నుంచి రూ.5 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు చాక్లెట్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్లను సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తూ చురుగ్గా ఉంటుంది. చాక్లెట్ రంగు దుస్తుల్లో ఈ బ్యూటీని చూసిన అభిమానులు, నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎటువంటి దుస్తులు ధరించినా రష్మికకు సరిగ్గా సూటవుతాయని, అమ్మడుద సహజమైన సౌందర్యం అంటూ పొగిడేస్తున్నారు.

ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్న రష్మిక భవిష్యత్తులో నటించబోయే సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యమున్నవి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా కథలను వింటోంది. అభిమానులు మాత్రం విజయ్ దేవరకొండను ఎప్పుడు వివాహమాడుతుందా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
-
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. తెలుగు ఎన్నారై ఇన్ ఫ్లూయెన్సర్ వీడియో వైరల్ ! -
బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడు అతనే ?? -
మధ్యతరగతి మనుషుల ఎమోషనల్ జర్నీ -
పెళ్లయిన నెల రోజులకే రష్మిక గుడ్ న్యూస్..? ముగ్గురం అయ్యామంటూ పోస్ట్ వైరల్.. -
'బైకర్' మూవీ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్.. 2 నెలల్లో 2 హిట్లు నీకే సాధ్యం అన్నా..! -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’












Click it and Unblock the Notifications