నిజ‌జీవిత పాత్ర‌లో నేచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి..

సాయి పల్లవి.. సినీ ప్రేక్ష‌కుక‌లు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు... సాయిప‌ల్ల‌వి అంటే మ‌న పక్కింటి అమ్మాయి.. ఆమె అందం ఆహ్లాదం... త‌న స‌హ‌జమైన‌ అభిన‌యంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. అంతేకాదు, త‌న నృత్యం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. అంత‌కుమించి ఏదున్నా.. ఓపెన్​గా మాట్లాడుతుంది. హీరోయిన్​ పాత్రలకు ఒప్పుకోదు. నటనకు ఆస్కారమున్న, నాయికాప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. ఇది సాయిప‌ల్ల‌వి అంటే..

తెలుగులో ఫిదా చిత్రంతో ప‌రిచ‌య‌మైన ఈ నేచుర‌ల్ బ్యూటీ... అతి త‌క్కువ సినిమాల్లో న‌టించింది. కానీ, అన్నీ సినిమాలు ఆమెకు పేరుతెచ్చిన‌వే... ఆ త‌ర్వాత తెలుగులో ఎమ్‌సిఎ, కణం, పడిపడిలేచె మనసు, లవ్​ స్టోరీ, శ్యామ్​సింగరాయ్​, విరాటపర్వం వంటి సినిమాలు చేసింది. ఈ సినిమాల్లో సాయిప‌ల్ల‌వి నటనకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. ఇప్ప‌డు, తాజాగా ఓ రియ‌ల్ లైఫ్ పాత్ర‌లో న‌టించింది ఈ నేచుర‌ల్ బ్యూటీ. అమ‌ర‌న్ అనే సినిమాలో సాయిప‌ల్ల‌వి ఓ ఆర్మీఆఫీసర్ భార్య‌గా న‌టించారు. ఇది ఒక నిజ జీవిత పాత్ర‌. దివంగత ఆర్మీ లెఫ్టనెంట్ ముకుంద్ వరదరాజన్ జీవితగాథ ఆధారంగా దివంగత ఆర్మీ లెఫ్టనెంట్ ముకుంద్ వరదరాజన్ జీవితగాథ ఆధారంగా తెర‌కెక్కిన చిత్ర‌మిది.

Natural beauty Sai Pallavi in real life role

ఆర్మీ ఆఫీస‌ర్ భార్య‌గా...

ఈ సినిమాలో తమిళ్ ప్రముఖ హీరో శివకార్తికేయన్ అమరన్ పాత్ర‌ను పోషించారు. ఈ సినిమాలో ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి న‌టించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబందించిన ఓ వీడియో తాజాగా విడుద‌ల‌య్యింది. నేచుర‌ల్ బ్యూటీ ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. అలాగే, ఓ ఇన్నోసెంట్ ఇల్లాలి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తోంది.

ఇక‌, చివర్లో తన భర్త మరణాంతరం రాష్ట్రపతి చేతుల మీదుగా అశోక్ చక్ర అవార్డు అందుకుంటున్న సన్నివేశాలు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ సీన్స్ ప్రోమోకి హైలెట్ గా నిలిచాయ‌ని చెప్పుకోవాలి. ఇక‌, ఈ ప్రోమో చూసిన‌వారంతా సాయిప‌ల్ల‌వి స‌హ‌జ‌న‌ట‌న‌ను మెచ్చుకుంటున్నారు. ఇందు పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి చక్క‌గా ఒదిగిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.అమరన్ చిత్రం తమిళ్ తోపాటు తెలుగు, హిందీ, మలయాళం భాషలలో కూడా విడుదల కానుంది. ఇక‌, ఈ చిత్రం అక్టోబర్ 31 న దీపావళి పండుగ సంద‌ర్భంగా రీలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+