నరుకుడే.. నరుకుడు.. నాని 'హిట్ - 3' ట్రైలర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే 1 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాని. ఇన్నాళ్లు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేసిన నాని దసరాతో రూట్ మార్చగా.. సరిపోదా శనివారం చిత్రంతో అదరగొట్టాడు. ఈ సినిమాతో కూడా అదే జోష్ కొనసాగించాలని చూస్తున్నాడు నాని. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని చూసి నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారాడనే కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మూడు నిమిషాల 31 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లోని కొన్ని షాట్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. క్రిమినల్స్ ఉంటే టెన్ ఫీట్ సెల్ లో ఉండాలి, లేదా భూములో సిక్స్ ఫీట్ హోల్ లో ఉండాలి అని నాని చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ముఖ్యంగా ప్రముఖ ప్రవచన కర్త శ్రీ చాగంటి వాయిస్ ఓవర్ తో ఇచ్చిన ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇక అర్జున్ సర్కార్‌గా నాని ఆటిట్యూడ్ గురించి హిట్ 2 లోనే చూశాం. ఇప్పుడు ట్రైలర్ లో కూడా నరుకుడే నరుకుడు అంటూ నాని చెలరేగి నటించినట్టు కనిపిస్తుంది.

ఇక ఐపిఆప్టికే హిట్ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడవి శేష్ నటించారు. ఇప్పుడు హిట్ 3 లో నానితో పాటు.. అడవి శేష్ కూడా కనిపిస్తారని రీసెంట్ గానే లీక్ ఇచ్చారు. అయితే నాని ఎలా అయితే హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ 3 చివర్లో.. 'హిట్ 4'లో హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ డైరెక్షన్ లో 'ది ప్యారడైజ్', సుజీత్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తున్నారు. 'ది ప్యారడైజ్'మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అసభ్య పదజాలం మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. నాని సినిమాలో ఈ తరహా డైలాగ్ ఏంటి అని ఒకింత షాక్ అయ్యారు.
అంతే కాకుండా ప్యారడైజ్ సినిమాలో నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నటి రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
-
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications