ఓటీటీని షేక్ చేస్తోన్న మర్డర్ మిస్టరీ...ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్
ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఓ సినిమా సత్తా చాటుతోంది. నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన 'ఎలెవన్' చిత్రం ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సస్పెన్స్, మలుపులతో నిండిన ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నీని అందిస్తుంది.
కథాంశం:
'ఎలెవన్' కథ ఒక మృతదేహం చుట్టూ తిరుగుతుంది. ఈ మృతదేహాన్ని పరిశోధించే క్రమంలో, నవీన్ చంద్ర పోషించిన ఎస్‌ఐ అశోక్ పాత్ర పలు క్లిష్టమైన రహస్యాలను ఛేదిస్తూ ముందుకు వెళ్తుంది. ప్రతి క్లూ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతూ, అశోక్ లక్ష్యం వైపు నెడుతుంది. ఈ కేసును అతను ఎలా పరిష్కరించాడు, అసలు ఆ మృతదేహానికి సంబంధించిన నిజాలు ఏంటి అనేది కథనం.

నటన:
నవీన్ చంద్ర ఈ చిత్రంలో తన నటనతో మరోసారి మెప్పించారు. ఎస్‌ఐ అశోక్ పాత్రలో ఒదిగిపోయి, భావోద్వేగాలను పండించడంలో అతను సక్సెస్ అయ్యారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలంగా నిలిచింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్‌కు సరిపడా మూడ్‌ను సెట్ చేయడంలో కెమెరా వర్క్ ప్రభావవంతంగా ఉంది. నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచుతూ కథనానికి మరింత బలాన్ని చేకూర్చింది. దర్శకత్వం విషయంలో, దర్శకుడు కథను పట్టుకు వదలని విధంగా నడిపించారు. కొన్ని చోట్ల నెమ్మదించినా, ఓవరాల్‌గా ప్రేక్షకుల ఆసక్తిని చివరి వరకు నిలుపుకోవడంలో సఫలమయ్యారు.
చివరి మాట:'ఎలెవన్' ఒక చక్కటి క్రైమ్ థ్రిల్లర్. నవీన్ చంద్ర అభిమానులకు, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక సస్పెన్స్‌ఫుల్ వీకెండ్ వాచ్‌కి ఇది సరైన ఎంపిక.
రేటింగ్:3/5












Click it and Unblock the Notifications