"మల్లెపూలు" తెచ్చిన తంట.. స్టార్ బ్యూటీకి రూ.1.14 లక్షలు ఫైన్ !

ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్పోర్టులో ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సాధారణంగా విమానాశ్రయాల్లో లగేజ్ చెక్‌లు, సెక్యూరిటీ స్కానింగ్ జరుగుతుంటాయి. కానీ తన వద్ద మల్లెపూలు ఉండటంతో ఆస్ట్రేలియా అధికారులు ఆమెకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మల్లెపూలు పెట్టుకున్నందుకు ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించారు.

అసలేం జరిగిందంటే?
ప్రతి మలయాళీ ఓనం పండుగను ఓ వేడుకలా జరుపుకుంటారు. కేరళలో మాత్రమే కాకుండా విదేశాల్లో అక్కడి అసోసియేషన్లు కూడా ఘనంగా జరుపుకుంటారు. అయితే విక్టోరియాలోని మలయాళీ అసోసియేషన్ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అక్కడి అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె దగ్గర 15 సెంటిమీటర్ల మల్లెపూల దండ ఉండటంతో ఆమెకు 1,980 ఆస్ట్రేలియన్ డాలర్లు(సుమారు రూ.1.14 లక్షలు జరిమానా విధించారు.

Navya Nair Fined Rs 1 14 Lakh in Australia for Jasmine Flowers at Airport

ఈ ఘటనపై స్పందించిన నవ్య నాయర్
ఈ ఘటనపై నవ్య నాయర్ ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "నేను ఆస్ట్రేలియాకు వెళ్లడానికి ముందు మా నాన్న నాకు మల్లెపూలు ఇచ్చారు. వాటిని రెండు భాగాలుగా చేసి, కొచ్చి నుంచి సింగపూర్‌కు వెళ్లేటప్పుడు జుట్టులో పెట్టుకోమని, అవి వాడిపోతాయని చెప్పారు. సింగపూర్ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్లేటప్పుడు రెండో భాగాన్ని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను చేసింది చట్ట విరుద్ధం. అది తెలియక చేసిన తప్పు. అయితే చట్టం తెలియదని చెప్పడం క్షమించరానిది. కేవలం 15 సెంటీమీటర్ల మల్లెపూల దండ తెచ్చినందుకు అధికారులు నాకు రూ. 1.14 లక్షల జరిమానా విధించారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాకపోయినా, తప్పు తప్పే. 28 రోజుల్లో జరిమానా చెల్లించాలని వారు నాకు చెప్పారు" అని నవ్య నాయర్ తెలిపారు.

ఈ ఘటన నవ్య నాయర్ పండుగ ఉత్సాహాన్ని దెబ్బతీయలేదు. ఆమె ఓనం వేడుకల్లో పాల్గొని ఆ ఆనందాన్ని పంచుకున్నారు. మెల్‌బోర్న్‌కు బయలుదేరడానికి రెండ్రోజుల ముందు ఆమె విమానంలో తీసుకున్న ఫోటోలను కూడా పంచుకున్నారు. అందులో ఆమె జుట్టులో మల్లెపూలు పెట్టుకుని కనిపించారు.

నవ్య నాయర్ గురించి..
రెండుసార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న నవ్య నాయర్.. సిబి మలయిల్ దర్శకత్వంలో 2001లో వచ్చిన 'ఇష్టం' చిత్రంతో నటిగా అరంగేట్రం చేశారు. ఆమె 'నందనం', 'కుంజిక్కూనన్', 'కళ్యాణరామన్', 'వెళ్లిత్తిర', 'పట్టణత్తిల్ సుందరన్' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మలయాళంతో పాటు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆమె నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+