Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీకాంత్, ధనుష్‌లకు పొరుగున.. కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరోయిన్!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన ఆర్థిక సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు. తాజాగా చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పోయెస్ గార్డెన్' ప్రాంతంలో నయనతార ఓ అద్భుతమైన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సుమారు రూ.31.5 కోట్ల విలువైన ఈ నివాసం, నయనతార విలాసవంతమైన లైఫ్ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. 2025 డిసెంబర్ 15న జరిగిన ఈ రియల్ ఎస్టేట్ లావాదేవీ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

స్టార్ల నివాసంగా 'పోయెస్ గార్డెన్'.. పక్కింట్లో రజనీకాంత్!
నయనతార ఎంచుకున్న ఈ ప్రాంతం సాధారణమైనది కాదు. ఇది చెన్నైలోని అత్యంత ఖరీదైన, ప్రముఖులు నివసించే ప్రాంతం. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ వంటి దిగ్గజ నటులు ఇప్పటికే ఇక్కడ నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా ధనుష్ 2024లో రూ. 150 కోట్లు వెచ్చించి ఇక్కడ ఓ భారీ బంగళాను నిర్మించుకోవడం విశేషం. ఇప్పుడు నయనతార కూడా అదే ప్రాంతంలో ఆస్తులను కలిగి ఉండటంతో, ఆమె కూడా ఈ స్టార్ల జాబితాలో చేరిపోయారు. టైనంపేటలోని ఈ 'లెగసీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్'లోని 4, 5వ అంతస్తుల్లో ఉన్న ఈ డూప్లెక్స్, అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించబడింది.

Nayanthara Buys Rs 31 5 Cr Duplex in Chennai Becomes Neighbor to Rajinikanth and Dhanush

ఆస్తుల పంపకం, ఇంటి విశేషాలు
నయనతార కొనుగోలు చేసిన ఈ డూప్లెక్స్ విస్తీర్ణం అక్షరాలా 14,369 చదరపు అడుగులు. కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాకుండా, ఏకంగా ఎనిమిది కార్లను పార్క్ చేసుకునేంత భారీ పార్కింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ ఆస్తి కొనుగోలులో నయనతార తన భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్‌ను కూడా భాగస్వామిని చేశారు. ఇందులో నయనతారకు 90 శాతం వాటా ఉండగా.. విగ్నేష్ శివన్‌కు 10 శాతం వాటా ఉంది. ఇది వీరిద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు, ఆర్థిక భాగస్వామ్యానికి నిదర్శనమని అభిమానులు పేర్కొంటున్నారు.

వంద కోట్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. రూ. 200 కోట్లు నికర విలువ
నయనతార కేవలం సినిమాలపైనే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆమె సుమారు రూ. 100 కోట్లకు పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనే పెట్టుబడి పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ వంటి విలాసవంతమైన ప్రాంతాల్లో ఆమెకు రెండు ఇళ్లు ఉన్నాయి, ఒక్కోటి రూ.15 కోట్ల విలువైనవి. వీటితో పాటు చెన్నై, కేరళలో కూడా ఆమెకు భారీ ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను కలిపి చూస్తే ఆమె నికర విలువ సుమారు రూ. 200 కోట్లుగా అంచనా వేయబడింది.

బిజీబిజీగా 'లేడీ సూపర్ స్టార్'.. చేతిలో 9 సినిమాలు
వృత్తిపరంగా నయనతార ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజీలో ఉంది. ఒక్కో సినిమాకు సుమారు రూ. 18 నుండి 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్న నయనతార.. డిమాండ్ ఉన్న నటిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 9 భారీ సినిమాలు ఉన్నాయి. ఇందులో బాలకృష్ణతో నటిస్తున్న 'NBK 111', 'మూకుత్తి అమ్మన్ 2', 'రాక్కాయీ', కన్నడలో యష్‌తో కలిసి నటిస్తున్న 'టాక్సిక్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో, రాబోయే రోజుల్లో ఆమె సంపాదన, ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+