చీ.. ఇంత దిగజారుతావా..హీరో ధనుష్‌పై నయనతార ఫైర్

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం.

ఇదిలా ఉంటే తాజాగా నయనతార ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానికి దీనికి కారణం హీరో ధనుష్. ఈ విషయాన్ని నయనతారే స్వయంగా వెల్లడించింది. నయనతార‌కు సంబంధించిన డాక్యుమెంటరీ నవంబర్ 18న నెట్‌ఫిక్స్‌లో విడుదల కానుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార సినీ కెరీర్‌లో ఎదురైన అనుభవాలు మొత్తం చూపించనున్నారు. ఇక్కడ వరకు బాగనే ఉన్నప్పటికీ, ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలను వినియెగించారు. దీనిపై హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నానుమ్‌ రౌడీ దాన్‌' సినిమాను హీరో ధనుష్ నిర్మించారు. తన అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీలో 'నానుమ్‌ రౌడీ దాన్‌' పాటలను వినియోగించడంపై ఆయన కోర్టులో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

Nayanthara criticized hero Dhanush

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార హీరో ధనుష్‌కు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పు బడుతూ నయనతార తీవ్రమైన ఆరోపణలు చేసింది. 'తండ్రి, దర్శకుడైన సోదరుడి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నాలాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది. నా వృత్తికి, ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా.

ఇందులో ఎలాంటి దాపరికం లేదు. నా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీప్రియులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించాం. మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులోభాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బందిపెడుతోంది. నా సినీప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం వంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైంది. మా జీవితంలో ఎంతో ముఖ్యమైన 'నానుమ్‌ రౌడీ దాన్‌' మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరమని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

ఈ సినిమాలోని ఫొటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్‌వోసీ కోసం దాదాపు రెండేళ్ల నుంచి మీతో ఫైట్‌ చేస్తున్నాం. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ కార్యక్రమం రిలీజ్‌ దగ్గర కానున్న సమయంలో మీ ఆమోదం కోసం ఎదురుచూశాం. చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు పర్మిషన్‌ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరం. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్‌ నోటీస్‌ నన్ను షాక్‌కు గురిచేసింది.

అందులో మూడు సెకన్ల క్లిప్స్‌ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్‌ చేయడం విచారకరం. ఇక్కడే మీ క్యారెక్టర్‌ ఏమిటనేది తెలిసిపోతుంది. అభిమానులకు మీరు పూర్తిగా తెలియదు. వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరు. మీ నోటీసుకు మేము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తాం. మా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం 'నానుమ్ రౌడీ దాన్' ఫొటోలు, పాటలను ఉపయోగించడం కోసం మీరు ఎన్‌వోసీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించవచ్చు. అయితే నైతిక కోణం అనేది ఉంటుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. దేవుడే దీనికి సమాధానం చెబుతాడని నయనతార తన లేఖలో పేర్కొంది. మరి నయనతార చేసిన ఆరోపణలపై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+