100 కోట్లు ఇచ్చినా ఆ తెలుగు హీరోతో నటించను - నయనతార
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళ నాట నయనతార క్రేజ్ వేరు. అక్కడి స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతున్నారు. ఇదిలా ఉంటే నయనతారకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.రూ.100 కోట్లు ఇచ్చిన ఓ హీరో పక్కన నయనతార అన్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. శరవణన్. తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రేక్షకులకు శరవణన్ సుపరిచితమే.
శరవణన్ హీరోగా 2022లో 'ది లెజెండ్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాలో మొదటగా నయనతారను హీరోయిన్‌గా తీసుకుందామని భావించారట. అయితే శరవణన్ పక్కన హీరోయిన్‌గా చేయడానికి నయనతార అంగీకరించలేదట. దీంతో ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా నటించింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వార్త మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు నయనతారతో పాటు, శరవణన్ దీనిపై ఎప్పుడు స్పందించలేదు. బాక్సాఫీస్ వద్ద 'ది లెజెండ్' సినిమా ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఇలాంటి సినిమాలో నయనతార నటించకపోవడమే మేలని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications