'ఉస్తాద్ భగత్ సింగ్'.. మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. రిలీజ్ కు ముందే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే మూవీ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి థియేటర్లలోకి వచ్చేంత వరకూ భారీ హైప్ ఉంటుంది. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ జోరు మామూలుగా ఉండదు. కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అయితే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు ఈ కాంబో నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. దాంతో ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ డిజిటల్ రైట్స్ ను రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా రూ. 80 కోట్లకు ఈ మూవీ రైట్స్ ను దక్కించుకుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేయలేదు. మూవీ టీమ్ నుంచి దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే సినిమా రిలీజ్ కు ముందే థియేటర్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు రూ.140 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని అంచనా. గతంలో ఓజీ సినిమా హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు తీసుకుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ రికార్డును కొనసాగిస్తుందని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని హరీశ్ శంకర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. దాంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు పాటలు రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.












Click it and Unblock the Notifications