నువ్వు ఏమైనా పతివ్రత వా ?.హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న

సోషల్ మీడియా వచ్చిన తరువాత తారతమ్యాలు లేకుండా పోయాయి. ఎక్కడ నుంచైనా ఎవరితోనైనా నేరుగా మాట్లాడే సౌలభ్యం అందరికి దక్కింది. ముఖ్యంగా సెలబ్రిటీలతో డైరెక్టుగానే కనెక్ట్ అయ్యే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో, హీరోయిన్లతో మాట్లాడే వారు కొందరైతే.. మరి కొందరు సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తున్నారు.

ఇలాంటి వారి వల్ల హీరోయిన్లు, సీనియర్ యాక్టర్స్ ఇబ్బందిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్, బీజేపీ మహిళ నేత మాధవీలతకు ఇలాంటి ఘటనే ఎదురైంది. తాజాగా మాధవీలత తన సోషల్ మీడియాలో ఓ విషయంపై స్పందించారు. దానికి నెటిజన్ కౌంటరిస్తూ మాధవీలత వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ఆ నెటిజన్ మాధవీలత ఉద్దేశించి మాట్లాడుతూ..పతివ్రత మాటలు మాట్లాడకు తల్లి. నీ బతుకు సినిమా మేనేజర్లను అడిగితే చెప్తారు.

netizen post an obscene message to the actress Madhavi Latha

నీ వేషాలకు ఎన్ని తిరుగుళ్లు తిరిగావో తెలుసులే. నాలుగు అడుగులు ఉండవు.. పతివ్రతలా మాట్లాడతావు అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. దీనిపై మాధవీలత తనదైనశైలిలో స్పందించింది. ఆఫర్ల కోసం మేనేజర్లను అడిగితే ఏం చెబుతారు. అలా పోవడానికి మేనేజర్స్ ఎందుకు...? నాకు తెలిసిన దర్శకులు, నిర్మాతలు కాల్ చేస్తే చాలు కదా అంటూ చాలా ఫన్నీగా స్పందించింది.

ఇదిలా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడటం మాధవీలత స్టైల్. ఒకొనొక సమయంలో సొంత పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఏ విషయమైనా నిర్మోహమాటంగా చెబుతుంటుంది. ఏపీ రాజకీయాలపై మాధవీలత మాట్లాడుతూ..ఎంతమంది కలిసి వచ్చినా కచ్చితంగా ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ ఆమె చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+