ఆ పని ఎప్పుడు చేస్తావ్ .. శృతి హాసన్‌ను ప్రశ్నించిన అభిమాని
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా శృతి హాసన్‌కు మంచి గుర్తింపు ఉంది.స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి సినీ కెరీర్‌ను పాడు చేసింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్‌షిప్‌కు 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది.ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు అతనితో డేటింగ్ నడిపిన శ్రుతి హాసన్ ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది.

శాంతను హజారికతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారిక శృతి హాసన్‌కు బ్రేకప్ చెప్పాడు. చేసిన తప్పును గ్రహించిన శృతి హాసన్..తిరిగి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 2023లో ఆమె ఖాతాలో నాలుగు హిట్లు చేరాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో ''వీరసింహారెడ్డి'', నానితో ''హయ్ నాన్న'' సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. ప్రభాస్‌తో నటించిన సలార్ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో..గతేడాది శృతి హాసన్‌కు బాగా కలిసి వచ్చింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఈ భామకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ అభిమాని ప్రేమకు అర్థం చెప్పమని కోరితే, మరో అభిమాని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని శృతి హాసన్‌ను ప్రశ్నించాడు. ఇంకో వ్యక్తి మీకు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగారు. దీంతో వారి ప్రశ్నలకు ఖంగుతున్న శృతి హాసన్ దయచేసి అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగ వద్దంటూ వేడుకున్నారు. ఇవి చాలా సిల్లీ ప్రశ్నలుగా అనిపిస్తున్నాయి, ప్లీజ్ అమ్మాయిలకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేసుకోనివ్వండి అంటూ కాస్తా ఘాటుగా సమాధానం ఇచ్చింది.












Click it and Unblock the Notifications