సమంత ఓ జోకర్..అంత మాట అనేశాడేంటి..!

తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా,కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది.ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొంది. 2013లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్‌ను గెలుచుకుంది.

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.

Netizens comments on Sobhita Dhulipala photos go viral

పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. వీరిద్దరు తమ హానీమూన్ పీరియడ్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇటీవలే 'వోగ్' మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్‌ను షేర్ చేసింది.

Netizens comments on Sobhita Dhulipala photos go viral

చీరలో పద్దతిగా కనిపించి శోభిత అభిమానులకు షాకిచ్చింది.ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం తన అభిప్రాయాన్ని వినూత్నంగా తెలియజేశాడు. శోభిత రెస్పక్ట్ బటన్ అంటూనే , సమంత జోకర్ బటన్ అని కామెంట్ చేశాడు.మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ కామెంట్స్ అన్నీ కూడా శోభితకు పాజిటివ్‌గా ఉన్నాయ్.. ఈ సమయానికే కొందరు వచ్చి నెగిటివ్ కామెంట్ చేయాలిగా అంటూ కామెంట్ చేశాడు. ఇలా శోభిత ధూళిపాళ ఫొటోలపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+