Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతారను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!!

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల జవాన్ సినిమా సక్సెస్ కావటంతో తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. సినిమాల ఆఫర్లతో నయనతార ప్రస్తుతం దూసుకుపోతున్నారు. ఇక ఈ మధ్య నయనతార తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్ ను లాంచ్ చేశారు. దీంతో ప్రస్తుతం నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

నయనతార తన స్వంత చర్మ సంరక్షణ బ్రాండ్ 9SKIN ను ప్రారంభించి బిజినెస్ లో కూడా ఆమె మరో అడుగు ముందుకు వేశారు. తన అందమైన చిత్రంతో తన సొంత బ్రాండ్ ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో పోస్ట్ చేసిన నయనతార తాను చేసిన పోస్ట్ లో బ్రాండ్ పేరు, బ్రాండ్ వెబ్ సైట్ లింక్ కూడా ఉంది.

Superstar Nayanthara

ఇంకా, నయనతార తన నోట్‌లో తన బ్రాండ్ ప్రకృతి మరియు ఆధునిక విజ్ఞాన సమ్మేళనమైన ఉత్పత్తులను అందిస్తుందని పేర్కొంది. నయనతార తన బ్రాండ్‌ను సెప్టెంబర్ 29, 2023న ప్రారంభించారు. స్వీయ సంరక్షణ దినచర్యను పెంచే ఉత్పత్తులను 9SKIN ఎలా అందిస్తుందో కూడా నయనతార పేర్కొన్నారు.

9 స్కిన్‌ పేరుతో ఇటీవల సొంత స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ను లాంచ్‌‌చేసిన నయనతారను నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్స్‌‌ కోసం చేసిన ఫొటోషూటే దానికి కారణమైంది. సామాన్యులకు అందనంత ధర ఉందని కొందరు మండిపడుతున్నారు. స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసేందుకు అంత మేకప్‌ అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

మేకప్‌ వేసుకోకుండా బ్రాండ్‌ను ప్రచారం చేయలేరా? ఇక అలాంటప్పుడు మీ బ్రాండ్ ఎలా పని చేస్తుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. నయనతార బ్రాండ్‌ కంటే తనను తాను ఎక్కువగా ప్రమోట్ చేసుకునేలా ఫొటో ఉందంటూ పలువురు కామెంట్స్‌ చేశారు. ఈ స్కిన్ ఉత్పత్తుల ధర రూ.999 నుండి రూ.1899 వరకు ఉంటుంది. దీని ధర ఎక్కువగా ఉండటంతో నయనతార అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+