'ఐ బొమ్మ' లో కొత్త ఆప్షన్లు
ఐబొమ్మ గురించి సినిమా అంటే ఇష్టపడే ప్రేక్షకుడిగా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అగ్ర కథానాయకులు తమ సినిమాల టికెట్ ధరలను మొదటి రెండువారాలు హిమాలయ పర్వతాల అంత ఎత్తు పెంచుకుంటూ సగటు ప్రేక్షకుడిని, అతడి కుటుంబాన్ని థియేటర్లకు దూరం చేస్తున్నారు. మళ్లీ వీరంతా అభిమానుల కోసమే ఉన్నామంటూ అనర్గళంగా ప్రసంగిస్తారు. తక్కువ బడ్జెట్ లో ఎంతో నాణ్యమైన విజువల్స్ ను అందివ్వొచ్చని హనుమాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ నిరూపించాడు. ఆ సినిమాకు అయిన ఖర్చు కేవలం రూ.40 కోట్లు కాగా దేశవ్యాప్తంగా రూ.415 కోట్ల వరకు వసూలు చేసింది.
ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచలేదు. సాధారణంగానే ఉన్నాయి.. కానీ భారీ వసూళ్లు రాబట్టింది. అంతంత టికెట్ ధరలుంటే ఎవరూ థియేటర్లకు వెళ్లరు. కచ్చితంగా ఐబొమ్మ లాంటి థర్డ్ పార్టీ వెబ్ సైట్ నుంచి సినిమాను డౌన్ లోడ్ చేసుకొని ప్రశాంతంగా కుటుంబ సభ్యులందరికీ కలిసి సినిమా చూస్తారు. తాజాగా ఐబొమ్మ తన సైట్ లో అనేక మార్పులు చేసింది. ఇప్పటివరకు తెలుగు సినిమాలే ఉండగా, ఇకనుంచి తమిళం, కన్నడం, మళయాళం, హిందీతోపాటు ఓటీటీల్లో వస్తున్నవాటిని కూడా తీసుకువచ్చింది. సబ్ డొమైన్స్ అనేకం అందుబాటులోకి వచ్చాయి.

ఎలాంటి లింకు పేజీలు లేకుండా సులువుగా సినిమాలను డౌన్ లోడ్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న అన్ని సినిమాలను ఉచితంగా అందిస్తోంది. బప్పం టీవీగా పేరు మార్చుకున్న ఐబొమ్మ సైట్ లో చోటుచేసుకున్న కొత్త ఆప్షన్లన్నీ సులువుగా ఉండటంతో సినిమాలు, సిరీస్ లు చాలా సులువుగా వీక్షించడంతోపాటు ఈజీగా డౌన్ లోడ్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే తమిళనాడు పోలీసులు తమిళ్ రాకర్స్ సైట్ కు చెందిన అడ్మిన్ ను అరెస్ట్ చేశారు. అక్కడి నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శోధించి అడ్మిన్ ను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications