'నిధి' పాప బంగారం.. ఒక్క రోజులోనే 15కి పైగా ఇంటర్వ్యూలు !
నిధి అగర్వాల్.. తెలుగు తెరపై మూడేళ్లు తర్వాత మళ్లీ మెరవనుంది. చివరిగా 2022 లో కనిపించిన ఈ భామ మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "హరిహర వీరమల్లు" సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాదాపు 13 సార్లు వాయిదా పడ్డ ఈ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాకు మొదట క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమా పూర్తిచేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించారు.

నిధి మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కమిట్ మెంట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. మూవీ పూర్తి అయ్యే వరకు మరో సినిమాలో నటించకుండా ఉన్న ఈ భామ.. ప్రమోషన్స్ విషయంలో కూడా ఈ చిత్రం కోసం చేసిన కృషి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
ఒక్కరోజులో 15కి పైగా ఇంటర్వ్యూలు..
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. అందులో భాగంగానే నిధి అగర్వాల్ తన డెడికేషన్‌ను మరోసారి నిరూపించింది. ఒక్కరోజులో ఏకంగా 15కి పైగా మీడియా ఇంటర్వ్యూలు అందరికీ షాక్ ఇచ్చింది. ఒక్కో ఇంటర్వ్యూ సగటున 30 నిమిషాల పాటు జరగగా.. నిధి సుమారు ఎనిమిది గంటలపాటు కూర్చుని వారితో మాట్లాడటం చాలా గొప్ప విషయం అంటున్నారు. నిజంగా మా నిధులు బంగారం అంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.

అలానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచింది. దాంతో ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది " నిధి అగర్వాల్ ". ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. రామ్ పోతినేనితో "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. పలు వరుస సినిమాల్లో నటించిన ఈమెకు తమిళ్‌లో అదిరిపోయే క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
#HariHaraVeeraMallu actress #NidhiAgarwal reportedly given 15 interviews in a single day
— ShowTime (@ShowTimeTweetz) July 19, 2025
Hats off to your dedication towards cinema @AgerwalNidhhi 👏🏻👏🏻👏🏻 pic.twitter.com/y0Wj4DMREG












Click it and Unblock the Notifications