నీహారిక రెండో పెళ్లికి వరుడు అతడేనా?

చిరంజీవి, పవన్ కల్యాణ్ సోదరుడైన నాగబాబు కుమార్తె నీహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మెగా కుటుంబంలో మహిళల పరంగా పేరుతెచ్చుకుంది ఆమె ఒక్కటే కావడం గమనార్హం. పరిశ్రమలో తన కాళ్లమీద తాను నిలబడేందుకు పోరాటం చేస్తుంటుంది. మొన్నటివరకు నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి సరైనరీతిలో ఆదరణ దక్కకపోవడంతో నిర్మాతగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

జొన్నలగడ్డ చైతన్యతో వివాహమై.. తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నీహారికకు రెండో పెళ్లిచేయడానికి నాగబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, మంచి వరుడికోసం వెతుకుతున్నారంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అన్న వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత నీహారికపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.. వస్తున్నాయి. కానీ ఆమె వాటిని ధీటుగానే ఎదుర్కొంటోంది.

niharika and vaishnav tej marriage gossips

విడాకులైన తర్వాత తన బావ సాయిధరమ్ తేజ్ ను వివాహం చేసుకుంటుందని అందరూ భావించారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వాటికి ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. సాయిధరమ్ తేజ్ తనకు కేవలం బావ మాత్రమేనని, ఎటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు తమకు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గురించిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

వైష్ణవ్ తేజ్, నీహారిక కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఫొటోలను బట్టి బావా మరదళ్లు సరదాగా ఆటపట్టించుకున్నారని, ఇద్దరికీ పెళ్లి కుదురుస్తారేమోనని నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ఇద్దరూ వివాహం చేసుకుంటే మంచిదని కొందరంటున్నారు. అయితే నీహారిక కంటే వైష్ణవ్ తేజ్ చిన్నవాడని, వారిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+