నాకు పిల్లలు కావాలనిపిస్తోంది - నిహారిక

మెగా డాటర్ నిహారిక మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విడాకులు తీసుకున్న తరువాత రీ ఎంట్రీ ఇవ్వడానికి అమ్మడు సిద్ధం అవుతోంది. వరుస సినిమాలతో పాటు, పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే..''చెఫ్ మంత్ర'' అంటూ యూట్యూబ్‌ ఛానెల్లో సందడి చేస్తోంది. నిహారిక ప్రస్తుతం ''సాగు'' అనే సినిమాకు ప్రజంటర్‌గా పని చేస్తోంది.

ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈక్రమంలో ''సాగు'' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిహారిక రెండో పెళ్లి, పిల్లలు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ''సాగు'' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ..నాకు పిల్లలంటే చాలా ఇష్టమని తెలిపింది. దీంతో సదరు యాంకర్ మిమ్మల్ని మళ్లీ పెళ్లి కూతురుగా చూడవచ్చా అని నిహారికను ప్రశ్నించగా, అమ్మో అది తెలియదు కానీ.. పిల్లలు కావాలనిపిస్తోంది.

Niharika interesting comments on childrens and second marriage

పిల్లలు కావాలనుకుంటున్నా కాబట్టి పెళ్లి చేసుకోవాలి. అది ఇప్పుడే చెప్పలేం అంటూ రెండో పెళ్లిపై పరొక్షం స్పందించింది. పిల్లల గురించే కాదు, ప్రేమపై కూడా నాకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధం అవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే నిహారిక బాబాయ్ పార్టీకి మద్దతుగా కూడా కొన్నివ్యాఖ్యలు చేసింది.

వచ్చే ఎన్నికల్లో మీరు పోటీపై క్లారిటీ ఇచ్చిన నిహారిక అలాంటిది ఏమీ లేదని తెలిపింది. కావాలంటే జనసేన పార్టీ తరుఫున పని చేయడానికి మెగా ఫ్యామిలీ సిద్ధంగా ఉందని నిహారిక ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాని చెప్పుకొచ్చింది. నిహారిక కెరీర్ విషయానికి వస్తే...మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు, పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+