ప్రభాస్‌పై తనకున్న కోరికను బయటపెట్టిన నిహారిక
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చారు.
విడాకుల అనంతరం కొంతకాలం సెలైంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తిరిగి టీవీ షోలు చేస్తోన్న నిహారిక, మంచు హీరో పక్కన హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి ఓ సినిమాను నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాశంతో డైరెక్టర్ యదు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో సాయి కుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ప్రధాన పాత్రలను పోషించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.
ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో కమిటీ కుర్రోళ్లు మూవీని నిహారిక గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. తనకు ఇష్టమైన హీరో గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మెగా హీరోలు కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించగా.. ప్రభాస్ అని నిహారిక బదులిచ్చింది.
ప్రభాస్‌తో ఒక్కసారైనా కలిసి యాక్టింగ్ చెయ్యాలని ఉందని నిహారిక తెలిపారు. ప్రభాస్ కామెడీ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ప్రభాస్ నటించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు నా మోస్ట్ ఫేవరెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఒకవేళ అలాంటి సినిమా ఆయనతో చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని నిహారిక తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. మరి ప్యాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్న ప్రభాస్‌తో యాక్ట్ చేసే అవకాశం నిహారికకు దక్కుతుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications