చైతన్యపై మెగా డాటర్ నిహారిక పోస్ట్ వైరల్

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.

అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారం గురించి నిహారిక పెద్దగా ఎప్పుడు స్పందించలేదు. ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది.

Niharika Konidela instagram post goes viral

పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే నిహారిక పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మిత్రులు, శత్రువులు, సక్సెస్, ఫెయిల్యూర్, పర్సనల్, ప్రొఫెషనల్.. ఇలా అన్నింటి గురించి మెన్షన్ చేసిన కార్డ్ మంచి మేసేజ్ ఇస్తుంది. అయితే ఈ పోస్ట్ తన మాజీ భర్త చైతన్య గురించే చేసిందని నెటిజన్లు అభిప్రాయడుతున్నారు.

మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపింది అంటూ ఫన్నీగా చర్చించుకుంటున్నారు. మరికొందరు విమర్శకులకు ఇలా బుద్ధి చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. నిహారిక కెరీర్ విషయానికి వస్తే...మంచు మనోజ్‌ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో పాటు, పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+