అతన్ని పడేయడం చాలా ఈజీ, ఆ హీరోతో రిలేషన్‌పై మెగా డాటర్ నిహారిక ఓపెన్ కామెంట్స్
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు దక్కలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.
అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది.ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి, విడాకులు, సినిమాల గురించి వెల్లడించారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకొంటరా అంటే సమాధానం చెప్పలేనని తెలిపింది.
అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయస్సు జస్ట్ 30..సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక కచ్చింతంగా రెండో పెళ్లి చేసుకుంటుందని భావిస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోలతో ఉన్న రిలేషన్ గురించి కూడా ఆమె స్పందించారు. అల్లు అర్జున్ హైపర్ యాక్టివ్‌గా ఉంటారని, అతను ఎనర్జీ వేరే లెవల్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఎవర్ని ఫ్లర్ట్ చేయడం ఈజీ అని అడగ్గా వైష్ణవ్ తేజ్ అని సమాధానం ఇచ్చింది. అతన్ని బుట్టలో పడేయడం ఈజీ అని , అతను నాకు టెడ్డీ బేర్ లాంటోడని నిహారిక తెలిపింది. ప్రస్తుతం నిహారిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications