అన్నా..నీ సినిమాకు థియేటర్ రెంట్ కూడా రావడం లేదు
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ,ఆ తర్వాత 'దిల్' అంటూ వెంటనే బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీల్లో నితిన్ ఓ రేంజ్‌కు వెళ్లతాడని అంతా భావించారు. అయితే వరుస ఫ్లాపులతో టాప్ రేసు నుంచి నితిన్ వెనక్కి తగ్గాడు. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా నితిన్ కెరీర్ మారిపోయింది.
'భీష్మ' తరువాత నితిన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్ చివరి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ,మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్, సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకున్నాయి. తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కడుములని నమ్ముకున్న వర్క్ అవుట్ కాలేదు.

'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' ,'రాబిన్ హుడ్' సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ తాజాగా నటించిన చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమా సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే నితిన్ సినిమాలను జనాలు చూడటం మానేశారేమో అనిపిస్తోంది. దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఈ సినిమా కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది.
సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మొదటి మూడు రోజుల్లో మూడు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే, నాల్గవ రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 16 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి.
మొత్తంగా, నాలుగు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ వసూళ్లు నమోదయ్యాయి. ఐదవ రోజు పరిస్థితి మరింత దిగజారిందని, హైదరాబాద్ వంటి టాప్ సిటీలో థియేటర్ల అద్దెలను కూడా తిరిగి సంపాదించుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. ఈ గణాంకాలు సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదని సూచిస్తున్నాయి.
దీంతో నితిన్ కెరీర్‌పై చాలా సందేహాలు ఏర్పడుతున్నాయి. స్టోరీ సెలక్షన్స్ విషయంలో జాగ్రత్తపడకపోతే నితిన్ కెరీర్ ముగిసిపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి రాబోవు సినిమాల విషయంలో అయినా నితిన్ జాగ్రత్త వహిస్తాడో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications