'హరి హర వీరమల్లు' కంటే ముందే పోలవరం ప్రాజెక్ట్..?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడు ? ఈ ప్రశ్న ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రచ్చ లేపుతోంది. ఈ సినిమాను బహుషా ఇప్పుడు పవన్ అభిమానులే మర్చిపోయారనుకుంటా.. ఏళ్లకుఏళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు. కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. మెగా ఫ్యాన్స్ లైఫ్ లో ఈ సినిమా రిలీజ్ ఓ పీడకలగానే మిగిలిపోతుందేమోనని వాపోతున్నారు.
మొన్నటి దాకా 'హరి హర వీరమల్లు'రిలీజ్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. మే 9న రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. తమ అభిమాన హీరోని తొలిసారి చారిత్రాత్మక వేషంలో చూడాలని సగటు పవన్ అభిమాని కల. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. ఇప్పటికే 11 సార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో రిలీజ్ కు ముందే అత్యధిక సార్లు వాయిదా పడ్డ సినిమాగా 'హరి హర వీరమల్లు' చరిత్రలో నిలిచింది.
దీంతో ఈ సినిమాకు మోక్షం ఎప్పుడోనని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ ను ఈ సినిమాకు లింక్ పెడుతూ పోస్టులు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అవుతూందని 'హరి హర వీరమల్లు' మాత్రం అక్కడే ఉంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 'PSPK 27' అనే వర్కింగ్ టైటిల్ తో 2020 జనవరిలో చిత్రాన్ని ప్రకటించారు.

ఆ తర్వాత 'హరి హర వీరమల్లు' అనే టైటిల్ పెట్టారు. అయితే సినిమా ప్రకటించి ఐదేళ్లు దాటినా ఇంతవరకూ సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ మూవీని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. క్రిష్ ఈ చిత్రం నుంచి వైదొలిగి కొండపొలం, ఘాటీ చిత్రాలను పూర్తి చేశారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల నిర్మాతలు మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ మూవీని మే 9న తీసుకొస్తామని అన్నారు. మరి నిర్మాతలు అనుకున్న టైమ్ కు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని వేచి చూడాలి.
Hhvm kanna mundhu polavaram project ayyidhi emo pic.twitter.com/7PXI91xh8j
— SaiTeja (@Saiteja253) April 15, 2025
ఇక పవన్ కల్యాణ్ మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ'. ఈ సినిమాపైనా రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్ మినహా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే దీనిపై మ్యూజిక డైరెక్టర్ తమన్ ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సెట్స్ కు వచ్చిన రోజు గిఫ్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications