'సలార్' పై షారుక్ ఖాన్ మైండ్ గేమ్?
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్ చిత్రంపై దేశవ్యాప్తంగా అందరిదీ ఒకటేమాట.. బ్లాక్ బస్టర్ అని. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించింది. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు నటించారు. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. ఆకాశాన్ని తాకేటట్లుగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. అలా అని సినిమాలో ప్రభాస్ కటౌట్ ఉంది కదా .. ఓవర్ ది టాప్ అన్నట్టు యాక్షన్ సీన్స్ డిజైన్ చేయకుండా ఎక్కడ ఫైట్ పడాలో అక్కడే పడేటట్లు చేశాడు. డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది. ట్రైలర్స్ అంచనాలు పెంచేలా కట్ చేయకుండా మంచి పనే చేశారంటున్నారు విశ్లేషకులు.

అయితే ఒక విషయంలో మాత్రం సలార్ కు నిరాశ తప్పలేదు. కేజీఎఫ్ లా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు సలార్ కు దొరకలేదు. పోటీగా షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా ఉంది. దానికి నెగిటివ్ టాక్ వచ్చినా .. ఎక్కువ థియేటర్స్ ను కావాలనే హోల్డ్ చేశారని, దీనివల్ల నార్త్ లో 'సలార్' కి అన్యాయం జరిగిందంటున్నారు. తెలుగులో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను చేతిలో పెట్టుకొని తనకు నచ్చిన రీతిలో కోట్ చేసి తక్కువకే సినిమాలను కొనుగోలు చేసే ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చేసినట్లుగా షారుక్ ఖాన్ తరఫువారు వ్యవహరించారంటున్నారు. షారుక్ ఖాన్ చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడాడని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అతను ఎంత ప్రయత్నించినా తొలిరోజు రూ.175 కోట్లు వచ్చాయనే విషయాన్ని గుర్తించాలని డార్లింగ్ అభిమానులు డంకీకి సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications