అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు.. సునీత విలియమ్స్ రాకపై చిరు రియాక్షన్
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన ఆమె.. ప్రణాళిక ప్రకారం ఐఎస్‌ఎస్‌లో వారిద్దరూ కేవలం 8 రోజుల పని కోసమే వెళ్లారు. అయితే స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్యాప్సూల్ వ్యోమగాములు లేకుండానే భూమిని చేరుకుంది. దాంతో సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్‌ఎస్ లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏవి సక్సెస్ కాలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములను ఎట్టకేలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ భూమిపైకి సురక్షితంగా తిరిగి తెచ్చింది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన సునీతా విలియమ్స్, విల్మోర్.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27కి ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమనౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే.. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికితీశాయి. ఆ తర్వాత స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటికి వస్తూ సునీత నవ్వుతూ అభివాదం చేశారు. భూమికి సురక్షితంగా చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని సునీతా విలియమ్స్ అన్నారు. ఇక ఆమె భూ వాతావరణానికి అలవాటు పడేంత వరకు వారికి తగిన చికిత్స అందించనున్నారు.

ఈ నేపథ్యంలో సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో ప్రపంచ నలుమూలల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల కుటుంబం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిపెడుతున్నారు. అలానే సునీత రాకపై సినీ, రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా రావడం పై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఆపోస్టులో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడం సంతోషంగా ఉందన్నారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజుల తర్వాత భూమి చుట్టూ 4577 సార్లు హీరోచితంగా భూమిపైకి తిరిగి వచ్చిన వారికి సుస్వాగతం అని కొనియాడారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని.. బ్లాక్ బస్టర్ అంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
WELCOME BACK TO EARTH 🌏
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 19, 2025
Sunita Williams & Butch Wilmore !! 🙏
HISTORIC & HEROIC ‘HOME’ COMING!!!
Went for 8 Days to Space & Returned after 286 Days, after an Astonishing 4577 orbits around earth !
Your Story is Unmatchably Dramatic, Utterly Nerve - Wracking , Unbelievably…












Click it and Unblock the Notifications