రోహిత్ శర్మతో ఎన్టీఆర్ 'దేవర' ప్రమోషన్స్..?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నతరుణం రానే వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'దేవర' సినిమాలోని మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించినట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందని అభిమానులు చెబుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ''ఎందుకు పుట్టిందో'' సాంగ్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ సాంగ్‌గా నిలిచింది. 'ఆచార్య' వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

దీనిలో భాగంగానే సినిమా ప్రమోషన్స్‌ను హిందీ నుంచే మొదలుపెట్టారు. అక్కడ వరుస ఇంటర్య్వూలో ఇస్తూ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ టాప్ షోలో సైతం ఎన్టీఆర్ దర్శనం ఇచ్చారు. బాలీవుడ్‌లో కపిల్ శర్మ షోకు మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొంటే సినిమాకు ఫుల్ పబ్లిసిటీ లభించినట్టే. అందుకే ఎన్టీఆర్ సైతం తన సినిమా ప్రమోషన్స్‌కు కపిల్ షోను ఎంచుకున్నారు. ఎన్టీఆర్ తో పాటు 'దేవర' సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా వచ్చింది. సైఫ్ అలీఖాన్ కూడా అతిథిగా వచ్చి జోకులు పేల్చారు.
When your favourite guests meet Kapil & gang, Shanivaar ka Funnyvaar banna pakka hai 😉
— Netflix India (@NetflixIndia) September 14, 2024
Watch #TheGreatIndianKapilShow Season 2 from 21 September, raat 8 baje, sirf Netflix par!#TheGreatIndianKapilShowOnNetflix pic.twitter.com/yNumhCh4s3
ఈ షోకి ఎన్టీఆర్‌తో పాటు నటి అలియా భట్ కూడా గెస్ట్‌గా రావడం జరిగింది. వీరిద్దరు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు. అలియా భట్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ కూడా ఇక్కడే నుంచే మొదలుపెట్టారు. ఈ షోలో భారత క్రికెట్ జట్టు సభ్యులు కూడా అతిథి పాత్రల్లో పాల్గొన్నారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మరికొందరు ఆటగాళ్లు షోకు వచ్చి సరదాగా గడిపారు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' ప్రోమో ఇప్పుడు విడుదలైంది. యంగ్ ఎన్టీఆర్, సైఫ్, జాన్హవి, అలియా, రోహిత్ శర్మ, కరణ్ జోహార్, సూర్య కుమార్ యాదవ్ మరియు పలువురు ప్రోమోలో కనిపించారు. 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' రెండో సీజన్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications