ఎన్టీఆర్ 'డ్రాగన్' టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్' సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తోపాటు యావత్ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్ లో శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఫ్యాన​​్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా స్లిమ్ ​గా పర్ ఫెక్ట్ షేప్ తో లాంగ్ గడ్డం, చెవికి రింగ్​ పెట్టి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్లు లేవు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్టేడ్ నెట్టింట వైరల్ అవుతోంది.

మే 20 న ఎన్టీఆర్ బర్త్ సందర్భంగా డ్రాగన్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా డ్రాగన్ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్ యావత్ పాన్ ఇండియాను షేక్ చేసేలా ఉండబోతుందని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఈమేరకు ఎన్టీఆర్ పీఆర్ ఇటీవల ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. దాంతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఓ మంచి యాక్షన్ టీజర్ కట్ ను ఇప్పటికే రెడీ చేసి ఉంచారని.. మే20న విడుదల కాబోయే ఈ టీజర్ మూవీ లవర్స్ కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని అలాగే ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని యాక్షన్ షాట్స్ ను ఈ టీజర్ లో పొందుపరిచారని సమాచారం.

NTR Birthday Blast Dragon Teaser Drops on May 20 Prashanth Neel Gifts Mass feast to Fans

ఇక ఈ ఒక్క టీజర్ తో డ్రాగన్ మూవీ అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కు చేరుకుంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ లుక్ కూడా హాలీవుడ్ యాక్షన్ హీరో ను తలపించే రేంజ్ లో డిజైన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డ్రాగన్ చిత్రంతో పాటుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే 'గాడ్ ఆఫ్ వార్' చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా మే 20న రాబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ అప్డేట్స్ పై అధికారిక ప్రకటనలు రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+