Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దసరా విజేత ఆ సినిమానే

సంక్రాంతి తర్వాత దసరానే తెలుగు ఇండస్ట్రీకి అతి పెద్ద పండుగ. సంక్రాంతి మాదిరిగానే దసరా కూడా పెద్ద హీరోల సినిమాలు సందడి చేస్తాయని అంతా భావించారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటించిన సినిమాలు ఈసారి దసరాకు విడుదల అవుతాయని తొలుత ప్రకటించినప్పటికీ , అల్లు అర్జున్ పుష్ప-2 వాయిదా పడటంతో ఎన్టీఆర్ నటించిన దేవర ఒక్కటే పెద్ద సినిమాగా దసరా బరిలో నిలిచింది. ఎన్టీఆర్ దేవరతో పాటు, 'విశ్వం' 'వెట్టయన్', 'మా నాన్న సూపర్ హీరో' 'జనక అయితే కనక' ,'జిగ్రా' మొదలగు సినిమాలు దసరా బరిలో నిలిచాయి. వీటిలో ఏ సినిమా దసరా హిట్‌గా నిలిచిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దసరా పండుగకు ముందే ఎన్టీఆర్ దేవర విడుదలైంది. గత నెల 27న దేవర ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజు డివైట్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా 'దేవర' దూసుకుపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా లాభాలతో దూసుకుపోతుంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయన్ సినిమా కూడా ఈ దసరాకే విడుదలైంది. అయితే తెలుగులో ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో సరిగా ప్రమోట్ చేయకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.

NTR Devara become a clean hit movies during Dussehra

సుధీర్ బాబు నటించిన 'మా నాన్న సూపర్ హీరో',సుహాస్ నటించిన 'జనక అయితే కనక' సినిమాల సందడే కనిపించలేదు. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియ భట్ నటించిన ,'జిగ్రా' సైతం తెలుగులో విడుదలైంది. సమంత, త్రివిక్రమ్ వంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హీరో గోపిచంద్ , దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన విశ్వం సినిమా సరిగ్గా పండుగనాడే విడుదలైంది. సినిమా బాగుందని టాక్ వినిపించినప్పటికీ,కలెక్షన్లు మాత్రం అనుకున్నంత స్థాయిలో లేవని తెలుస్తోంది. దీంతో ఈసారి దసరా బరిలో క్లీన్ హిట్‌గా నిలిచిన మూవీగా ఎన్టీఆర్ దేవర నిలిచింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+