ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో భారీ సినిమా..! రా అండ్ రస్టిక్ స్టోరీతో..
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మరో భారీ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ లుక్స్ ను పూర్తిగా మార్చేశాడు డైరెక్టర్ సుక్కూ.. ఈ క్రమంలో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లను అటు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు మరింతగా ఇష్టపడుతుంటారు. వీరి కాంబోల్లో మళ్లీ మళ్లీ సినిమాలు రావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి ఎన్టీఆర్, సుకుమార్.. సుకుమార్ డైరెక్షన్ లో గతంలో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే వీరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పుష్ప-2 తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్. ఈ మూవీ దాదాపు రూ. 1500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక సుకుమార్ తన తదుపరి చిత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ గతంలోనే పేర్కొన్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ మూవీ తర్వాత సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం మాదిరిగానే రా అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక త్రివిక్రమ్ తో మరో సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications