టీడీపీకి షాక్..వైసీపీ జెండాలతో థియేటర్లలో రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. ఇదే సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. మొదటి రోజు దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
YSRCP Flag Is Flying High!!✊🔥
— YSRCP Brigade (@YSRCPBrigade) September 27, 2024
YSRCP Flag At Devera Movie. pic.twitter.com/mME6EBeyLm
ఇండియాలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు నెట్ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషలలో హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ తమ రివ్యూలు ఇస్తున్నారు.

సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారని, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవర హిట్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులు ఓ థియేటర్లో వైసీపీ జెండాతో హల్ చల్ చేశారు. దేవరలోని టైటిల్ సాంగ్ వచ్చే సమయంలో వైసీపీ జెండాతో అభిమానులు చిందులు వేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గతంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు జగన్ పార్టీకి మద్దతుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీలు సైతం జగన్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Devara x YCP celebrations🇸🇱🔥🤙
— pasupu_putra_sundharavadana (@ntr_roars) September 27, 2024
NTR-YCP mutuals🤝#Devara #YSRCP #NTR #YSJagan pic.twitter.com/N0ihVlIk41












Click it and Unblock the Notifications