మారణహోమానికి ముందు కూల్ గా.. సింహం నవ్వింది..
మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?.. అట్టుంటాది ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మారణహోమం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎన్టీఆర్‌నీల్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ 22 నుంచి ఈ చిత్రం షూటింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ కటౌట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సన్నగా, ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్లాక్ షర్ట్, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఎప్పుడూ లేనంత స్టైల్ గా కనిపించాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ను నీల్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చూస్తున్నాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు నెక్ట్స్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని మూవీ టీమ్ హింట్ ఇస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, రవిశంకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
THE HUNT BEGINS…🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2025
Man of Masses @tarak9999 sets off to join the shoot of #NTRNeel from April 22nd 💥💥
ABSOLUTE MAYHEM 🌋 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @Tseries pic.twitter.com/nedtDCWGuz
ఇక దేవర బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో తారక్ న్యూలుక్ పై విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇటీవల అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ లుక్ అందర్నీ షాక్ కు గురి చేసింది. ఆయన పూర్తిగా సన్నబడి కనిపించడం వల్ల అసలు ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదంతా ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనని తెలుస్తోంది.ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్.. దేవర 2 చిత్రంలో నటించనున్నాడు.












Click it and Unblock the Notifications