'కల్కి'సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె అవుట్,కారణం ఇదే..!!
Deepika Padukone:'కల్కి 2898 AD' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన నటి దీపికా పదుకొణెపై సంచలన ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించారు.ఈ వార్త అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "కల్కి 2898 AD వంటి సినిమాకు పూర్తి నిబద్ధత అవసరం. అందుకే దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో భాగం కాదు" అని పేర్కొంది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.

నిజంగా ఏం జరిగింది?
నిర్మాతలు ఈ నిర్ణయం వెనుక కారణాన్ని కూడా స్పష్టం చేశారు. "ఎంతో సుదీర్ఘంగా తొలి సినిమా ప్రయాణం చేసినప్పటికీ, ఆమెతో భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోయాం" అని వైజయంతి మూవీస్ పేర్కొంది. ఆమె భవిష్యత్ ప్రాజెక్టులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రకటన ముగించింది. ఈ నిర్ణయం వెనుక కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న ఊహాగానాలు నిజమేనని తేలింది.
గతంలోనూ అదే కారణం
దీపికా ఇటీవల కాలంలో ఒక రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని డిమాండ్ చేస్తున్నారని, అది పెద్ద సినిమాలకు సెట్ అవ్వడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'కల్కి' నిర్మాతలు "పూర్తి నిబద్ధత" గురించి మాట్లాడటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. దీపికా పదుకొణెకి ఇప్పుడు ఓ బిడ్డ ఉంది, తల్లి అయిన తర్వాత ఆమె తన కుటుంబానికి,పనికి సమయం కేటాయించడంలో కొన్ని మార్పులు కోరుకుంటున్నారని, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్‌కి ఇబ్బందిగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
SUM-80 పాత్రలో దీపికా తొలి భాగంలో కీలక పాత్ర పోషించింది దీపికా. ఇప్పుడు ఆమె సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో ఆ పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. నాగ్ అశ్విన్ ఈ కథనంలో ఎలాంటి మార్పులు చేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే కల్కి-1 చిత్రం 2024 జూన్ 27వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.
ఇటీవల రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన'సింగం అగైన్'లో మహిళా పోలీస్ అధికారిగా దీపికా నటించారు. 'కల్కి' తర్వాత ఆమె ఏ చిత్రాలను ఎంపిక చేసుకుంటారనేది ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
-
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ












Click it and Unblock the Notifications