OG: ఏం జరిగినా బాధ్యత వాళ్లదే..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ట్రాన్స్ నడుస్తోంది. మరికొన్ని గంటల్లో ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంజాయ్ చేశారు. సుజిత్, పవన్ కల్యాణ్, తమన్.. ఈ ముగ్గురి కాంబో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి చేస్తున్న విధ్వంసం అని అంటున్నారు. పవన్ తుపాన్ కు తోడుగా తమన్, సుజిత్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద హైప్ ఆకాశాన్ని తాకుతోంది. సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టించినా బాధ్యత వీళ్లదే అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "ఓజీ" నామస్మరణ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మరికొన్ని గంటల్లో మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూవీ నుంచి రిలీజైన ఒక్కో పోస్టర్, సాంగ్స్ ఇంటర్నెట్ ను రఫ్పాడిస్తున్నాయి. సాహో మూవీ తర్వాత సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యణ్‌ టైటిల్‌ రోల్‌ లో కనిపిస్తారు. ఓజాస్ గంభీరా పాత్రలో వీర విహారం, రచ్చరంబోలా చేసేందుకు సిద్దం అయ్యారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ రిలీజ్ కానుంది.

తాజాగా రిలీజైన #WashiYoWashi సాంగ్ స్పెషల్ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇందులో పవన్ కళ్యాణ్ జపాన్ భాషలో మాట్లాడారు. అయితే ఈ పాటకు సంబంధించిన తెలుగు లిరిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. 'ఒక క్రూరమైన గ్రద్దని చంపాలంటే, ముందు దాని రెక్కలను నరకాలి. అది నెల మీదకు పడిపోయిన తర్వాత దాని కళ్లు పీకేయాలి. అప్పుడు ఆ క్రూరమైన గ్రద్ద గుడ్డిది అవుతుంది. దానికి ఎటు వెళ్లాలో అర్థం కాదు. అలాంటి సమయం లో దాని కాళ్లు నరికేయాలి. అప్పుడు ఆ గ్రద్ద ఎటు కదలక అలా నరకం అనుభవిస్తున్న సమయం లో దాని గుండెని పీకేయాలి అంటూ తెలుగు లిరిక్స్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.

OG Fever Grips Hyderabad Ticket Bookings Open Amid Massive Trailer Buzz and Vashi Lyrics Drop

ఇప్పటికే హైదరాబాద్ లో ఈ మూవీకి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మరో 5 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+