వైరల్ వీడియో: మళ్లీ వచ్చావా అక్కా.. పవన్ చూస్తే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ సినిమా కోసం అభిమానులతో పాటు సగటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ జరగనుంది. ఇప్పటికే వేలాదిమంది ఫ్యాన్స్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ వేడుకలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
😭😭😭 pic.twitter.com/06l8dItPzg
— Aria (@TheReddyAria) September 20, 2025
Orey🤣🤣🤣 pic.twitter.com/Be6TG4mUe2
— HarshaVardhan🐉 (@Harsha2_) September 5, 2025
ఇక ఇప్పటికే ఓజీ సినిమా ప్రీమియర్స్ కు రెండు తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బెనిఫిట్ షోలు, 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 గంట షో టికెట్ ధరను రూ.1000 గా నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు అనుమతి ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ షోల టికెట్ ధరను రూ.800గా ఉంది. అలాగే అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.150 టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతి లభించింది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మేనియా స్టార్ట్ అయింది. అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు కూడా ఓజీ ఓజీ అంటూ హల్ చల్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మహిళ ఓజీ బ్యాండ్ తలకు కట్టుకుంది. ఓజీ అని చెంపలకు రాసి ఉంది. పవన్ కల్యాణ్ డైలాగ్స్ చెప్తుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ మూవీ రిలీజయ్యాక ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications