OGTrailer: ఓజీ ట్రైలర్ లో అకీరాను ఎంతమంది చూశారు..?
ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఓజీ ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఓ చేత్తో కత్తి.. మరో చేత్తో గన్ పట్టుకుని వేటకు బయల్దేరిన సింహంలా ఉగ్రరూపం చూపించారు. యూట్యూబ్ లో ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన ఐదు గంటల్లోనే దాదాపు 50 లక్షల మంది ఈ ట్రైలర్ ను వీక్షించారు. అలాగే 6 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో ట్రైలర్ తోనూ పవర్ స్టామినా చూపించారు పవన్ కల్యాణ్. ఇప్పటికే రిలీజైన పాటలు, పోస్టర్స్ సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కావడంతో రిలీజ్ కు ముందే హైప్ తో చచ్చిపోయేట్టు ఉన్నారు ఫ్యాన్స్.
ఇక తాజాగా మరో సంచలనం కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రైలర్ లోనూ అతడికి సంబంధించిన షాట్ ఉంది. ఈ షాట్ అకీరాదే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్ 16 ఏళ్లు ఉన్నప్పుడు సీన్స్ ను అకీరాతో చేపించారని టాక్. ఇదే నిజమైతే థియేటర్లు బద్ధలవడం కాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ లో పవన్ కల్యాణ్ ఇమ్రాన్ హష్మీ కు ఫోన్ చేసి ముంబై వస్తున్నాను తలలు తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత చేతిలో కత్తి పట్టుకొని కిందికి నడుచుకుంటూ వచ్చే ఒక షాట్ ఉంటుంది. అది అకీరా నందన్ కాళ్లకు సంబంధించిన షాట్ అని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అని చెప్పొచ్చు. సినిమా రిలీజయ్యాక దీనిపైన క్లారిటీ రానుంది.

ఇక తాజాగా ఓజీ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 154 నిముషాలుగా ఉంది. ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ రావడం ఆశ్చర్యకరంగా ఉంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత మెగా సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు సమాచారం. చివరిగా రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాకి మాత్రమే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమాలో రక్తపాతం బీభత్సంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 25 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.












Click it and Unblock the Notifications