నాగ చైతన్య ఆ హీరోయిన్‌తో ఇలా దొరికిపోయాడేంటీ..?
అక్కినేని నట వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తాత, తండ్రి వారసత్వాన్ని నాగచైతన్య కొనసాగిస్తారని అభిమానులంతా భావించారు. అయితే నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు. నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు.
హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. నాగచైతన్య వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా ఏం లేదు. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య..కొద్దిరోజులకే ఆమెకు విడాకులిచ్చాడు. అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత చైతు తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి.

దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. దీంతో శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు.తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారా అంటూ నెటిజన్లు వీరిని ప్రశ్నిస్తున్నారు. నాగ చైతన్య శోభితతో ఇలా దొరికిపోయాడేంటీ..? అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరు తాము కేవతం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications