చిరంజీవి సినిమానే డామినేట్ చేస్తున్నాడుగా..!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. సింపుల్ స్టోరీ, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు,మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి లాంటి చిత్రాలతో యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ హీరో.. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' చిత్రంతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. కొన్ని ఏరియాల్లో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాను కూడా డామినేట్ చేస్తుండటం విశేషం.
హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన 'అనగనగా ఒక రాజు' చిత్రం థియేటర్ల వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ మూవీ జనవరి 18న అంటే నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా తర్వాత ఈ సినిమాను చూసేందుకే ప్రేక్షకులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మెగాస్టార్ మూవీ ఓవైపు థియేటర్ల వద్ద సునామీ సృష్టిస్తోంది. ఆరు రోజుల్లోనే ఈ మూవీకి రూ. 300 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఓజీ రికార్డుల్ని ఈ మూవీ బద్దలు కొట్టింది.

అయితే నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రం ఓవర్సీస్ లోనూ దూసుకెళ్తోంది. ఆదివారం రోజున 560 షోస్ కు గాను నార్త్ అమెరికా లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం $228K డాలర్స్ రాబట్టింది. మరోవైపు 'అనగనగా ఒక రాజు' చిత్రం కేవలం 500 షోస్ తో $220K డాలర్స్ ను రాబట్టింది. తక్కువ షోస్ ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాతో సమానంగా వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో ఎక్కువ షోస్ ఉండుంటే కచ్చితంగా డామినేట్ చేసి ఉండేదని ఫిల్మ్ సర్కిల్ వర్గాలు అంటున్నాయి. ఇక మొత్తంమీద 'అనగనగా ఒక రాజు' చిత్రం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 31 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications