రమ్యకృష్ణతో భర్తగా, అన్నగా, నాన్నగా నటించిన ఏకైక నటుడు అతడే..!
నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆరిస్టుగా రాణిస్తుందామె. ముఖ్యంగా 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్‌ల్లో కనిపించడానికే భయపడే సమయంలో బికినితో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాకిచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది.
ఆ తర్వాత కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవతారం ఎత్తారామె. హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్ల కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే రమ్యకృష్ణ కెరీర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. అయితే ఎంతోమందితో కలిసి నటించిన రమ్యకృష్ణ, ఒక్కరి పక్కన మాత్రం విభిన్న పాత్రల్లో కనిపించారు.

ఒక నటుడు సరసన భార్యగా, చెల్లెలుగా, కూతురిగా నటించారు రమ్యకృష్ణ. ఆ నటుడు మరెవరో కాదు..నాజర్. తెలుగు ఇండస్ట్రీలో నాజర్‌కు మంచి గుర్తింపు ఉంది. గతంలో తమిళ హీరోగా నటించిన నాజర్, ఆ తర్వాత క్యారెక్టర్ ఆరిస్ట్‌గా మారి తమిళ, తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ, నాజర్ ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. రజనీకాంత్ సినిమా నరసింహలో నాజర్ చెల్లెలిగా రమ్యకృష్ణ కనిపించారు. ఇక అత్తారింటికి దారేది తమిళ వెర్షన్ వంత రాజవతన్ వరువేన్ సినిమాలో నాజర్ కూతురుగా రమ్యకృష్ణ నటించారు. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు భర్తగా నాజర్ కనిపించి మెప్పించారు. ఇలా ఒకే యాక్టర్ సరసన మూడు విభిన్న పాత్రల్లో నటించారు రమ్యకృష్ణ.












Click it and Unblock the Notifications