రజనీకాంత్‌‌‌కు భార్యగా, లవర్‌గా, కూతురుగా నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా...?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్‌ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ''జైలర్‌''ను మినయిస్తే.. మిగిలిన సినిమాలు ఆశించిన విధంగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కబాలి, కలా, దర్బార్, పెద్దన్న వంటి సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది.

అసలు ''లాల్ సలాం'' అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయం ప్రేక్షకులకు తెలియదంటే .. రజనీకాంత్‌ సినిమాల పరిస్థితి ఎంత దారుణంగా తయ్యారైందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రజనీకాంత్‌ నుంచి సినిమా వస్తుందంటే తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగ వాతవరణం కనిపించేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తి విరుద్దంగా మారిపోయింది. రజనీకాంత్‌ స్టామినా తగ్గిపోవడంతో పాటు, యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో సూపర్ స్టార్ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. తెలుగులో అయితే రజనీకాంత్‌ మార్కెట్ రోజు రోజుకి పడిపోతుంది.

only heroine acted as wife lover and daughter of Rajinikanth

''లాల్ సలాం'' కలెక్షన్లు చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రజనీకాంత్‌‌‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. రజనీకాంత్‌‌‌కు భార్యగా, లవర్‌గా, కూతురుగా ఓ హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు మీనా. మీనా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించిన 'ఎంకెయో కెట్టా కురల్', 'అన్బుల్లా' వంటి సినిమాల్లో మీనా చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. 'ఎంకెయో కెట్టా కురల్'సినిమాలో రజనీకాంత్ కూతురుగా మీనా నటించింది. ఆ తర్వాత వచ్చిన వీర, యజమాన్, ముత్తు చిత్రాల్లో లవర్, మరదలు, భార్య పాత్రల్లో కనిపించింది. ఇలా రజనీకాంత్ సరసన విభిన్న పాత్రల్లో కనిపించింది మెప్పించారు మీనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+