నాగ చైతన్యకు అమ్మగా, భార్యగా, ప్రియురాలుగా నటించిన ఏకైక హీరోయిన్
హీరో నాగ చైతన్య వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తాండేల్ సినిమాలో నటిస్తున్న చైతన్య..ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు. విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్‌గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి చేయడానికి నాగ చైతన్య రెడీ అయ్యాడు. 'విరూపాక్ష' మాదిరిగానే ఈ సినిమా కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కబోతుంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేష్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు సూపర్ స్టార్లుగా ఎదిగారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య హీరోగా నిలబడటానికి నానా తంటాలు పడుతున్నాడు.

నాగచైతన్య ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించాడు . కానీ హిట్ కొట్టింది మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. చైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు. హిట్ కొట్టిన సినిమాల్లో కూడా స్టోరీ పరంగాను హీరోయిన్ పరంగాను హిట్ అయినవే ఎక్కువ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. కారణాలు తెలియదు కానీ నాగ చైతన్య కెరీర్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హీరోయిన్ నాగ చైతన్యతో అమ్మగా, భార్యగా, ఫ్రెండ్‌గా నటించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు లావణ్య త్రిపాఠి. వీరిద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నాగార్జున సరసన నటించింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగర్రాజు తెరకెక్కింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమాలో నాగ చైతన్యకు లావణ్య త్రిపాఠి అమ్మగా కనిపించింది. యుద్ధం శరణం సినిమాలో నాగ చైతన్య ప్రియురాలుగా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఇక మనం సినిమాలో నాగ చైతన్యకు ఫ్రెండ్ పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించి మెప్పించింది. ఇలా నాగ చైతన్య సరసన పలు విభిన్న పాత్రల్లో కనిపించింది మెప్పించింది లావణ్య త్రిపాఠి.












Click it and Unblock the Notifications