ఈ 2 సినిమాల్లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇదే!

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి హీరో తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆశతో ఉంటారు. ప్రతి హీరో కల అది. సంక్రాంతికి సినిమా విడుదలైనే మినిమం గ్యారంటీ అనే సెంటిమెంట్ దశాబ్దల తరబడి ఉంది. సాధారణ సినిమా కూడా ఈ సమయంలో విడుదలైనే సూపర్ హిట్ అయి నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తుంది. అందుకే ప్రతి హీరో, నిర్మాత, దర్శకుడు సంక్రాంతికి తమ సినిమా విడుదల చేయాలనే ప్రణాళికతో ఉంటారు. అందుకనుగుణంగా సినిమాను ప్రారంభించేవారు కూడా ఉంటారు. తెలుగులో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నవారిలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఉంటారు.

కుటుంబ ప్రేక్షకులంతా ఆ సినిమాకే
వీరిలో బాలయ్య ఒక్కరే సంక్రాంతికి ఎక్కువ సినిమాలను విడుదల చేశారు. వాస్తవానికి డాకూ మహారాజ్ విజయదశమికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాలుగు రోజులకే రూ.105 కోట్లు కొల్లగొట్టి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లవైపు దూసుకుపోతోంది. అలాగే విక్టరీ వెంకటేష్ సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులంతా థియేటర్లకు కదిలివస్తారు. అది ఆయన బలం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఈ రెండు సినిమాల్లో మైనస్ లు ఉన్నాయి. కానీ ప్లస్ లు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి.

only this movie is the 2025 sankranthi blockbuster in telugu

కొత్తగా చెప్పిన బాబీ
డాకూ మహారాజ్ కథ పాతదే అయినా దర్శకుడు బాబీ కొత్తగా చెప్పడంతోపాటు బాలయ్యను ఇంతవరకు ఎవరూ చూపించనిరీతిలో చాలా స్టైలిష్ గా చూపించారు. భావోద్వేగాలను పండించారు. హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు కొత్తగా ఉన్నాయి. అర్థరాత్రి సమయంలో కూడా ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేస్తున్నారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వితీయార్థం కాస్తంత విసుగుపుట్టించినప్పటికీ వెంకీ తన కామెడీ టైమింగ్ తో లాక్కొచ్చారు. కాస్తంత లాగ్ అయిందంటూ విమర్శలు వచ్చాయి. చాలావరకు ప్రేక్షకులను నవ్వించారు.

కుటుంబ ప్రేక్షకులంతా ఈ సినిమాకు వెళితే, యాక్షన్ సినిమాలు కావాలనుకునేవారు డాకూ మహారాజ్ కు వెళ్లారు. నైజాంలో ఈ సినిమాకు థియేటర్లు దొరకలేదు. దీనిపై బాలయ్య చాలా అసంతృప్తితో ఉన్నారు. లేదంటే కలెక్షన్లు మరింత పెరిగేవని అభిప్రాయపడుతున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టోటల్ గా సంక్రాంతి విజేతగా ఈ సినిమా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+