optical illusion : ఈ ఫొటోలో బుల్లెట్లు ఎక్కడున్నాయో గుర్తిస్తే మీరు గ్రేట్..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న ఓ సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ విజువల్ పజిల్ ఒకేసారి మన దృష్టి సామర్థ్యాన్ని, సహనాన్ని, ఏకాగ్రతను పరీక్షిస్తోంది. ఈ సవాలులో చిత్రంలో దాగి ఉన్న రెండు బుల్లెట్లను కేవలం 15 సెకన్లలో గుర్తించాల్సి ఉంటుంది. చదవడానికి చాలా ఈజీగా అనిపించినా, ఆచరణలో మాత్రం చాలా మందికి తలపట్టుకునేలా మారింది.
ఈ చిత్రంలో బూడిదరంగు నేపథ్యంపై సైనికులకు సంబంధించిన అనేక సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అందులో తుపాకులు, గ్లోవ్స్, బ్యాక్‌ప్యాక్‌లు, హెల్మెట్‌లు, రేడియోలు, మెడికల్ పౌచ్‌లు, ఫ్లాష్‌లైట్లు, బూట్లు, బ్యాటరీలు, ఇంకా ఒక చిన్న తెల్లటి రబ్బర్ డక్ కూడా కనిపిస్తుంది. ఈ అనేక వస్తువుల మధ్య రెండు చిన్న బుల్లెట్లను చాలా నైపుణ్యంతో దాచారు. అవి సాధారణంగా కనిపించే వస్తువుల్లా కలిసిపోవడంతో గుర్తించడం మరింత కష్టమైంది.

ఈ చిత్రాన్ని ఒకరు షేర్ చేయగా.. కొద్ది గంటల్లోనే వందలాది కామెంట్లు, వేలాది వ్యూస్ వచ్చాయి. చాలా మంది యూజర్లు 15 సెకన్లు కాదు, ఐదు నుంచి పది నిమిషాల వరకు స్క్రీన్‌ను జూమ్ చేసి వెతికామని కామెంట్లలో పేర్కొన్నారు. అయినా కూడా చాలామందికి బుల్లెట్లు కనిపించలేదని చెప్పారు. మొదటి చూపులో ఇది సాధారణ సైనిక సామాగ్రి ఫోటోలా కనిపిస్తుంది. కానీ గమనిస్తే, ప్రతి వస్తువు రంగు, ఆకారం ఒకదానితో ఒకటి కలిసిపోయేలా అమర్చారు. దీంతో చిన్న పరిమాణంలో ఉన్న బుల్లెట్లు నేపథ్యంతో పూర్తిగా మేళవించి కంటికి దొరకకుండా పోతున్నాయి. ఇదే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రత్యేకత ( optical illusion ).
optical illussion కనిపెట్టలేదా..
ఇక బుల్లెట్లు కనిపించని వారి కోసం పరిష్కారం చూస్తే... మొదటి బుల్లెట్ చిత్రంలోని దిగువ ఎడమ వైపున ఉంటుంది. తెల్లటి రబ్బర్ డక్ దగ్గర, సప్రెషర్ పక్కన, లేత గోధుమ మరియు పచ్చ రంగు పరికరాల మధ్య అది దాగి ఉంది. సరైన యాంగిల్‌లో జూమ్ చేస్తే తప్ప అది కనిపించదు. రెండవ బుల్లెట్ చిత్రంలోని పైభాగం ఎడమ వైపున, బ్యాటరీల సమీపంలో దాగి ఉంటుంది. అక్కడ ఉన్న అనేక చిన్న వస్తువుల మధ్య అది పూర్తిగా కలిసిపోయి ఉండటంతో, కంటికి సులభంగా పడదు. ఒకసారి గుర్తించిన తర్వాత మాత్రం "ఇది ఇంతసేపు నా కళ్ల ముందే ఉందే!" అనిపిస్తుంది.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌లు వినోదంతో పాటు మెదడుకు మంచి వ్యాయామంగా కూడా పనిచేస్తాయి. పరిశీలన శక్తి, ఏకాగ్రత, వివరాలపై శ్రద్ధ పెంచేందుకు ఇవి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇలాంటి పజిల్స్ ( optical illusion ) కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications