ఓటీటీలో హీటెక్కించే టాప్ 5 మూవీస్ ఇవే.. ఇప్పుడే చూసేయండి..!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూతబడ్డాయి. దీంతో మూవీ లవర్స్ కు బోర్ కొడుతున్నట్లు ఉంది. మీకోసం ఓటీటీలోకి ఈ ఏడాది బెస్ట్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని టాప్ లో దూసుకెళ్తున్నాయి. ఈ వివరాలను ఓర్మాక్స్ సంస్థ వెల్లడించింది. ఓటీటీల్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 చిత్రాలను పేర్కొంది. ఈ లిస్టులో మూవీస్ తో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.

ఓర్మాక్స్ సంస్థ వెల్లడించిన వివరాల్లో తొలి స్థానంలో మహావతార్ నరసింహ ఉంది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ ఏడాది జులై 25 న విడుదలైన ఈ యానిమేషన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. రూ. 15 కోట్లతో నిర్మితమై బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి యానిమేషన్ చిత్రాల్లో చరిత్ర సృష్టించింది. ఓటీటీలో విడుదలై అక్కడ కూడా టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఓటీటీలో మహావతార్ నరసింహ 57 లక్షల వ్యూస్ సాధించింది. ఈ సినిమా స్ఫూర్తితో భవిష్యత్తులో తెలుగులో మరిన్ని యానిమేషన్ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.

ఇక ఈ లిస్టులో సెకండ్ ప్లేస్ లో బాలీవుడ్ మూవీ సైయారా ఉంది. సైయారాకు ఓటీటీలో 45 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక మూడో స్థానంలో మోహన్‌ లాల్ నటించిన 'హృదయపూర్వం' చిత్రం ఉంది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి 34 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక రజినీకాంత్ కూలీ మూవీ నాలుగో స్థానానికి పడిపోయింది. అమెజాన్ ప్రైమ్‌ లో విడుదలైన ఈ మూవీకి గత వారం 30 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇక అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్‌ ల వివరాలు ఓసారి చూస్తే ఆర్యన్ ఖాన్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ 57 లక్షల వ్యూస్‌ రాబట్టి మొదటి స్థానంలో ఉంది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్‌ సెలబ్రిటీల తెర వెనుక జీవితాలు, లవ్‌ స్టోరీస్‌, లస్ట్ వంటి అంశాలను వివరించారు. ది ట్రయల్ సీజన్ 2 రెండో స్థానంలో ఉంది. సిక్సర్స్ సీజన్ 2 మూడో స్థానంలో నిలిచింది. తమన్నా డూ యు వాన్నా పార్ట్నర్ , వెన్స్‌ డే సీజన్ 2.. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

Ormax Unveils India s Top 5 OTT Movie Binge-Worthy Hits This Week

ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాంతార చాప్టర్ 1 అక్టోబర్ 31 నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే కల్యాణి ప్రియదర్శన్ లోకా -చాప్టర్ 1: చంద్ర మూవీ కూడా ఈ నెల 31వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+