OSCAR 2024: ఆస్కార్ వేదికపై మరోమారు 'ఆర్ఆర్ఆర్' నాటు నాటు జోష్!!
సౌత్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా RRR పాట నాటు నాటు ఆస్కార్స్ 2024లోనూ జోష్ నింపింది. ఈ పాట ఈ ఆస్కార్ వేడుకలోనూ కనిపించింది. నాటు నాటు 2023లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్‌లో ఆస్కార్‌ను గెలుచుకుంది. ట్రోఫీని గెలుచుకున్న మొదటి భారతీయ పాటగా నిలిచింది.
ఇక తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నేడు జరిగిన అవార్డు వేడుకలో, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ప్రెజెంటేషన్ సందర్భంగా నాటు నాటులోని రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌ల విజువల్స్ స్క్రీన్‌పై ప్రదర్శించబడ్డాయి. అకాడమీ అవార్డుల ప్రదానం సందర్భంగా నాటు నాటు పాటకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఈ ఏడాది అరియానా గ్రాండే మరియు సింథియా ఎరివో ఆస్కార్స్ 2024లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును దక్కించుకున్నారు. వారు వేదికపైకి వెళ్తుండగా, గత సంవత్సరం విజేతగా నిలిచిన నాటు నాటు సాంగ్ విజువల్స్ ప్రదర్శించబడ్డాయి. క్లిప్‌లో, ప్రధాన నటులు రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పాట యొక్క హుక్ స్టెప్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇక ఈసారి 'బార్బీ' సినిమాలోని 'వాట్ వజ్ ఐ మేడ్ ఫర్' పాటకు పురస్కారం లభించింది.
ఆ క్షణం వీడియోను పంచుకుంటూ, RRR యొక్క అధికారిక ఎక్స్ ఖాతా మళ్ళీ ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ .. నాటు నాటు అంటూ గర్వంగా చెప్పుకుంది. గత సంవత్సరం, అత్యంత ప్రతిష్టాత్మక వేడుకలో నాటు నాటు పాట రచ్చ చేసింది. అవార్డు ప్రకటనకు ముందు, ఒరిజినల్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ మరియు కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటును ప్రదర్శించారు. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు ఇంకా ప్రపంచం మరచిపోలేదు.
95వ అకాడమీ అవార్డ్స్‌లో RRRకి ప్రాతినిధ్యం వహించిన వారిలో SS రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ, సంగీత స్వరకర్త MM కీరవాణి మరియు గీత రచయిత చంద్రబోస్ ఉన్నారు. నాటు నాటు ప్రదర్శనను ప్రేక్షకులకు పరిచయం చేసింది మరెవరో కాదు అకాడమీ సమర్పకుల జాబితాలో ఉన్న ఏకైక భారతీయురాలు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే. ఈ ప్రదర్శన ఆస్కార్ వేడుకకు హాజరైన ప్రేక్షకుల నుండి స్టాండింగ్ ఒవేషన్‌ను అందుకుంది.
On the #Oscars stage again!! ❤️🔥❤️🔥❤️🔥 #RRRMovie pic.twitter.com/cbNgFzMt72
— RRR Movie (@RRRMovie) March 11, 2024












Click it and Unblock the Notifications