మన హీరోల నిర్లక్ష్యం: పాన్ ఇండియా మార్కెట్‌ను పోగొట్టుకుంటున్నారు!

మన హీరోలకు రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా నిర్లక్ష్యం వచ్చేసిందేమో అనిపిస్తోంది. అంతేకాదు.. ఒళ్లు బద్దకంతో సినిమాలు సమయానికి చేయకుండా సంవత్సరాల తరబడి ఆలస్యం చేస్తూ ఉన్న మార్కెట్ ను కూడా పోగొట్టుకుంటున్నారు. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రభాస్ అగ్ర స్థాయి కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు. బాహుబలి1, 2, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి చిత్రాల తర్వాత రాజాసాబ్ లాంటి సినిమా తీసి ప్రేక్షకులకు అందిస్తే దాన్ని ఎవరు ఆదరిస్తారు? దాన్ని అసలు ఎవరూ సినిమాగా కూడా చూడటంలేదు.

భయంతో సినిమాలు చేయాలి
ఇంతలావు సినిమా కోసం ఏళ్ల తరబడి షూటింగ్, విపరీతమైన డబ్బు ఖర్చు. అసలు నిజంగా పాన్ ఇండియా మార్కెట్ ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేయాలి. మార్కెట్ ను కాపాడుకోవాలి. అలా కాకుండా ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే.. ఉత్తరాదివారికి తమవారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఉన్న హీరోలు అక్కడి ప్రేక్షకుల్లో ఆ ఫీలింగ్ వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇలా చేయడంవల్లైనా దక్షిణాది నుంచి వచ్చే హీరోల తాకిడిని తట్టుకోవడం వీలవుతుందని భావిస్తున్నారు.

our-heroes-are-losing-out-on-the-pan-india-market-due-to-their-negligence-and-laziness

మొన్నటివరకు ఏ సినిమా చేయాలో తెలియక, ఏది చేసినా ఫ్లాప్ వుతుండటంతో రణవీర్ సింగ్ కు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని కూడా ఓ కార్యక్రమంలో ఎలాంటి సినిమా చేయాలనండి అని అడిగారు. సినిమాల గురించి తనకు తెలియదని ఆయన సమాధానమిచ్చారు.

వారికీ, మనకు తేడా ఇదే
ఇప్పుడు అదే రణవీర్ సింగ్ దురంధర్ సినిమాతో దుమ్మురేపుతున్నాడు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒకే భాషల్లో కలెక్షన్లు కొల్లగొట్టేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం అంటూ.. ఏ ఇతర భాషల్లోకి విడుదల చేయకుండా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మరి .. మిగతా హీరోలు ఈ రికార్డులను బద్దలు కొట్టడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజుకు దురంధర్ కలెక్షన్లు ఆగడంలేదు. కనీసం రోజుకు రూ.5 కోట్లు తక్కువ కాకుండా వస్తోంది. అంటే నెలకు రూ.150 కోట్లు. దక్షిణాది హీరోలకన్నా మిన్నగా సినిమా చేయాలి? మన మార్కెట్ ను మనం నిలబెట్టుకోవాలని అని తపన పడ్డారు.. దాన్ని నిలబెట్టుకుంటున్నారు. వచ్చిన మార్కెట్ ను మనవాళ్లు బ్రహ్మాండంగా పోగొట్టుకుంటున్నారు. అంతే తేడా.. వారికీ, మనకు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+