మా ప్రయాణం త్వరలో ప్రారంభం: టాలీవుడ్ హీరో ప్రకటన
'అందాల రాక్షసి' సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి నవీన్ చంద్ర మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. కొంతకాలం నుంచి మంచి సినిమాలే చేస్తున్నప్పటికీ సరైన రీతిలో హిట్ పడటంలేదు. ఇటీవలే షో టైమ్, 28 డిగ్రీల సెల్పియస్, లెవన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న నవీన్ ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తున్నాడు. తాజాగా సైకలాజికల్ థ్రిల్లర్ 'హనీ' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా ప్రారంభించినట్లు నవీన్ చంద్ర తెలిపాడు.
ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నాం
మంచి ఆలోచనాత్మక విధానంతో దర్శకుడు కరుణకుమార్ డబ్బింగ్ ప్రారంభించారని, ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్న చాలా శక్తివంతమైన, అత్యంత హృదయ విదారకరమైన సినిమా పనులు జరుగుతున్నాయని నవీన్ చెప్పారు. దర్శకుడు ఈ సినిమాకు చాలా లోతైన భావోద్వేగానికి సంబంధించిన అంశాన్ని జోడించారని, చాలా ఆకర్షణీయమైన సబ్జెక్టుతో ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలోనే తమ ప్రయాణం ప్రారంభం కాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాను శేఖర్ స్టూడియో బ్యానర్‌పై రవి పీట్లతో కలిసి శేఖర్ మాస్టర్ నిర్మిస్తున్నారు. దివ్య పిళ్లై, దివి, రాజా రవీంద్ర, కల్యాణి మాలిక్, బేబీ జయని తదితరులు నటిస్తున్నారు. అజయ్ అరసాడ స్వరాలందించారు.

అది ప్రేమా? ఆకర్షణా?
నవీన్ చంద్ర త్వరలోనే తమ ప్రయాణం ప్రారంభం కాబోతోందంటూ ట్వీట్ చేయగానే అందరూ తాను కూడా ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడేమోనని, కొత్తగా ప్రేమ ప్రయాణం ప్రారంభిస్తున్నాడేమోనని నెటిజన్లు చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే దర్శకుడు కరుణకుమార్ తో కలిసి సైకలాజికల్ త్రిల్లర్ సినిమా డబ్బింగ్ చెబుతున్నానని, ప్రమోషన్స్ ప్రారంభిస్తామని చెప్పగానే అందరూ నిరాశపడ్డారు. సినీ పరిశ్రమలో కొత్త కొత్త ప్రేమలు పుట్టుకురావడం, భార్యాపిల్లలు ఉండగానే వేరొకరితో కలిసి తిరుగుతుండటాన్ని ప్రేమ అంటారా? ఆకర్షణ అంటారా? అంటూ నెటిజన్లు చర్చ పెట్టారు.












Click it and Unblock the Notifications