సానియా మీర్జా రెండో పెళ్లి? వరుడు తెలుగు స్టార్ హీరోనా?

భారత టెన్నిస్ లో స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన భర్తకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. వీటివల్ల తమ 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. సానియా విడాకులు తీసుకున్నామని ప్రకటించగానే షోయబ్ మాలిక్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. షోయబ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉండటంవల్లే సానియా విడాకులిచ్చిందంటూ వార్తలు వచ్చాయి.

రెండో పెళ్లి చేసుకోవాలా?
ప్రస్తుతం సానియా మీర్జాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. సానియా రెండో పెళ్లికి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ టెలివిజన్ లో ఓ న్యూస్ షోలో పాల్గొన్న జాఫర్ విడాకులు తీసుకుంటే రెండోపెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా ఉంటే సరిపోదా? అనే సానియా మీర్జా చెప్పిన మాటకు అతని అభిప్రాయం చెప్పమని యాంకర్ అడిగారు. దీనికి అతడిచ్చిన సమాధానమే ప్రస్తుతం వైరలవుతోంది.

pakistan actor nabeel Zafar comments on sania mirza second marriage

విడాకుల తర్వాత చీకటి ఉండకూడదు
విడాకులు తీసుకున్నంతమాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదని, విడాకులు తీసుకోవడం అనేది దురదృష్టకరమైన చర్య అయినప్పటికీ దాని తర్వాత ఎవరి జీవితం చీకటిలో ఉండకూడదన్నారు. సానియా.. నీకు మంచి భాగస్వామి దొరికితే తప్పకుండా రెండో పెళ్లి చేసుకో. సానియా రెండో వివాహం చేసుకోవడం ఏమాత్రం తప్పుకాదు. ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నాడు అని గుర్తుచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిపై సానియామీర్జా అభిప్రాయం ఏమిటనేది తెలియాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, తెలుగులో ఓ స్టార్ హీరోను ఆమె ప్రేమిస్తోందని, వారి బంధాన్ని వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ హీరో ఎవరో చెప్పమని అడుగుతున్నారు. మొత్తానికి హీరో పేరు లేకుండానే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదే చిత్రంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+